Share News

గజదాడిలో రైతు దుర్మరణం

ABN , Publish Date - Jun 05 , 2025 | 01:33 AM

ఏనుగు దాడిలో ఓ రైతు దుర్మరణం చెందాడు. ఐరాల మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని నాగమవాండ్లపల్లె భజనబండ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బుఽధవారం వేకువ జామున ఐదు ఏనుగుల గుంపు నాగమవాండ్లపల్లెలోని పొలాలపై దాడి చేశాయి.

గజదాడిలో రైతు దుర్మరణం
గణపతి మృతదేహం (ఇన్‌సెట్లో) ఫైల్‌ ఫొటో

- నాగమవాండ్లపల్లె భజనబండ సమీపంలో దుర్ఘటన

ఐరాల, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఏనుగు దాడిలో ఓ రైతు దుర్మరణం చెందాడు. ఐరాల మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని నాగమవాండ్లపల్లె భజనబండ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బుఽధవారం వేకువ జామున ఐదు ఏనుగుల గుంపు నాగమవాండ్లపల్లెలోని పొలాలపై దాడి చేశాయి. మామిడి, చెరకు, వరి పంటలతోపాటు రాతి కూసాలు, కంచెను ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో గోవిందరెడ్డిపల్లెకు చెందిన ఓ రైతు మామిడి తోటపై పడ్డాయి. సమీపంలోనే రైతు సూరిమాని గణపతి(60), మునీశ్వరి దంపతులు తమ తోట వద్ద నిద్రిస్తున్నారు. ఏనుగుల ఘీంకారానికి వారు నిద్రలేచారు. భార్యను అక్కడున్న గదిలోనే ఉండమని చెప్పి ఏనుగులను తరమడానికి గణపతి ఒక్కడే వెళ్లాడు. ఓ ఏనుగు ఆయనపై దాడి చేయడంతో తల పగిలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల అలజడి తగ్గాక గ్రామంలోని రైతులు పొలాల వద్దకు చేరుకున్నారు. అక్కడ గణపతి మృతదేహం కనిపించడంతో కుటుంబీకులకు, పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పునరావృతం కాకుండా చర్యలు

ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ అన్నారు. నాగమవాండ్లపల్లెలో గణపతి మృతదేహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు.

రూ.10లక్షల పరిహారం

రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10లక్షల పరిహారాన్ని ప్రకటించినట్లు గణపతి కుటుంబీకులకు ఎమ్మెల్యే మురళీమోహన్‌, డీఎ్‌ఫవో భరణి తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం బాధితులకు రూ.5లక్షల చెక్కును అందించారు. టీడీపీ మండల అధ్యక్షుడు హరిబాబునాయుడు, మాజీ అధ్యక్షుడు గిరిధర్‌బాబు, నాయకులు మణినాయుడు, లత, రాజే్‌షరెడ్డి, రంజిత్‌రెడ్డి, పురుషోత్తం, కోదండయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 01:33 AM