సోలార్ ఫెన్సింగ్‌పై పడి రైతు మృతి
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:28 AM
సత్యవేడు మండలం మదనంబేడులోని పొలాల వద్ద బుధవారం రాత్రి సోలార్ ఫెన్సింగ్‌పై పడి రైతు మృతిచెందారు. గ్రామస్తుల కథనం మేరకు.. పంటకు నీళ్లు పెట్టడానికని నాదముని కుమారుడు శ్రీరామ్‌షణ్ముగం పొలానికి వెళ్లారు.
సత్యవేడు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సత్యవేడు మండలం మదనంబేడులోని పొలాల వద్ద బుధవారం రాత్రి సోలార్ ఫెన్సింగ్‌పై పడి రైతు మృతిచెందారు. గ్రామస్తుల కథనం మేరకు.. పంటకు నీళ్లు పెట్టడానికని నాదముని కుమారుడు శ్రీరామ్‌షణ్ముగం పొలానికి వెళ్లారు. సోలార్ విద్యుత్ స్విచ్ ఆన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా అదుపుతప్పి పొలానికి ఏర్పాటు చేసిన సోలార్ కంచెపై పడ్డారు. ఆ సమయంలో అక్కడ ఎవరూలేక పోవడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ఎంత సేపటికీ షణ్ముగం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వచ్చి చూడగా మృతి చెంది ఉన్నారు. మృతదేహాన్ని ఇంటికి తరలించారు. కాగా షణ్ముగంకు భార్య, కుమారుడు ఉన్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం గ్రామానికి చేరుకుని షణ్ముగం భౌతికకాయానికి నివాళులు అర్పించి, మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. షణ్ముగం కుటుంబ సభ్యులకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందించారు.