సత్యవేడులో నకిలీ రెవెన్యూ ముఠా!
ABN , Publish Date - Dec 28 , 2025 | 01:53 AM
సత్యవేడులో నకిలీ రెవెన్యూ ముఠా ఒకటి ప్రభుత్వ, గ్రామకంఠం భూములకు పొజిషన్ సర్టిఫికెట్లను తయారు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామకంఠం భూములకు రిజిస్ట్రేషన్ చేయాలంటే రెవెన్యూ శాఖ అనుమతులు పొందాలి. అది గ్రామకంఠం భూములేనని రెవెన్యూ శాఖ ధ్రువీకరిస్తూ తహసీల్దార్ మంజూరు చేసే పొజిషన్ సర్టిఫికెట్ ఆధారంగా రిజిష్ట్రేషన్ శాఖ ఆ భూములను రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే ఈ ముఠా నకిలీ రెవెన్యూ స్టాంపులు, తహసీల్దార్ ఫోర్జరీ సంతకాలతో పొజిషన్ సర్టిఫికెట్లు జారీచేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ వ్యక్తి కనుసన్నల్లో ఈ తంతు జరగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠాకు రెవెన్యూ శాఖలోని కొంతమంది సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందిస్తూ అందుకు తగ్గ ప్రతి ఫలం పొందుతున్నట్లు సమాచారం. మండలంలోని ఓ గ్రామంలో ఒకరి అనుభవంలో ఉన్న పొరంబోకు భూమికి ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందని తెలియడంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాకు కొంతమంది బడాబాబుల అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తహసీల్దార్ రాజశేఖర్‌ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపితే నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
సత్యవేడు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): సత్యవేడులో నకిలీ రెవెన్యూ ముఠా ఒకటి ప్రభుత్వ, గ్రామకంఠం భూములకు పొజిషన్ సర్టిఫికెట్లను తయారు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామకంఠం భూములకు రిజిస్ట్రేషన్ చేయాలంటే రెవెన్యూ శాఖ అనుమతులు పొందాలి. అది గ్రామకంఠం భూములేనని రెవెన్యూ శాఖ ధ్రువీకరిస్తూ తహసీల్దార్ మంజూరు చేసే పొజిషన్ సర్టిఫికెట్ ఆధారంగా రిజిష్ట్రేషన్ శాఖ ఆ భూములను రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే ఈ ముఠా నకిలీ రెవెన్యూ స్టాంపులు, తహసీల్దార్ ఫోర్జరీ సంతకాలతో పొజిషన్ సర్టిఫికెట్లు జారీచేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఓ వ్యక్తి కనుసన్నల్లో ఈ తంతు జరగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠాకు రెవెన్యూ శాఖలోని కొంతమంది సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందిస్తూ అందుకు తగ్గ ప్రతి ఫలం పొందుతున్నట్లు సమాచారం. మండలంలోని ఓ గ్రామంలో ఒకరి అనుభవంలో ఉన్న పొరంబోకు భూమికి ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందని తెలియడంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాకు కొంతమంది బడాబాబుల అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై తహసీల్దార్ రాజశేఖర్‌ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపితే నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.