నకిలీ మందు గుట్టు ఇక రట్టు
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:03 AM
ములకలచెరువులో కల్తీ మద్యం తీగ లాగితే.. రాష్ట్రమంతా కదిలింది. దీనిపై ప్రభుత్వం సిట్‌నూ వేసింది. అదే సమయంలో నకిలీ మద్యం గుట్టు విప్పడానికి ప్రభుత్వం యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. బాటిల్‌పై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అసలా.. నకిలీనా అనేది గుర్తించొచ్చు.
స్కాన్ చేయి.. వివరాలు తెలుసుకో
అందుబాటులోకి ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్
ములకలచెరువులో కల్తీ మద్యం తీగ లాగితే.. రాష్ట్రమంతా కదిలింది. దీనిపై ప్రభుత్వం సిట్‌నూ వేసింది. అదే సమయంలో నకిలీ మద్యం గుట్టు విప్పడానికి ప్రభుత్వం యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. బాటిల్‌పై క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అసలా.. నకిలీనా అనేది గుర్తించొచ్చు.
- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి
కల్తీ మద్యంను రట్టు చేయడానికి ప్రభుత్వం ‘ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్’ను తీసుకొచ్చింది. దీనిని తిరుపతిలోని అర్బన్ ఎక్సైజ్ సీఐ కార్యాలయంలో బుధవారం సీఐ రామచంద్రతో కలిసి జిల్లా ఎక్సైజ్ ఈఎస్ నాగమల్లేశ్వర రెడ్డి ఆవిష్కరించారు. ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలనే దానిపై అవగాహన కల్పించారు. కల్తీ మద్యం అరికట్టేందుకు.. మరోవైపు లిక్కర్ షాపులు, బార్ల వద్ద నాణ్యమైన మద్యం విక్రయాలకు ఈ యాప్ దోహదపడనుంది. మద్యం బాటిల్ మీద వున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతనే మద్యం విక్రయించాలి.
యాప్‌ను ఇలా వాడాలి
సెల్‌ఫోనులోని ప్లే స్టోర్‌కు వెళ్ళి ‘ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్’ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఇన్‌స్టాల్ చేశాక రెండు ఎంపికలు కనిపిస్తాయి. ఒకటి వినియోగదారుల కోసం, మరొకటి మద్యం దుకాణాల నిర్వాహకుల కోసం.
వినియోగదారుడు ఐఎంల్ లిక్కర్ బాటిల్‌పై వున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. ఆ తర్వాత వెరిఫై ప్రొడక్టును ఎంపిక చేయగానే మద్యం బాటిల్‌పై ఉన్న బ్యాచ్ నెంబరు, ఎక్కడ తయారైంది? ఎటు నుంచి వచ్చింది? బ్రాండు పేరు, ధర వివరాలన్నీ స్ర్కీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ అది నకిలీ మద్యం అయితే ‘డిటైల్స్ నాట్ ఫౌండ్’ అని కనిపిస్తుంది.
ఈ యాప్‌లోని సమాచారం జిల్లా క్రేందంలోని అధికారులకు, రాష్ట్ర స్థాయి అధికారుల డేటా బేస్‌కు వెళుతుంది.
ఇక, అబద్ధ ప్రచారం చేయలేరు
ఇకపై మద్యం దుకాణాల్లో నకిలీ మద్యం ఉందనే అపోహాలు, వదంతులు సృష్టించలేరు. ప్రభుత్వం, డిపార్టుమెంటుపై అబద్దాలు ప్రచారం చేసే అవకాశాలు ఉండవు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అసలు మద్యం కొనుగోలు చేయాలి. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు.
- నాగమల్లేశ్వర రెడ్డి, ఎక్సైజ్ ఈఎస్