రెవెన్యూ డివిజన్ల పరిధి పెంపు
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:22 AM
ఇప్పటివరకు తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు రెవెన్యూ డివిజన్లున్నాయి. ఇకపై గూడూరు మినహా మూడే ఉంటాయి. దీంతో డివిజన్ల పరిధి పెరగనుంది.
ఇప్పటివరకు తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు రెవెన్యూ డివిజన్లున్నాయి. ఇకపై గూడూరు మినహా మూడే ఉంటాయి. దీంతో డివిజన్ల పరిధి పెరగనుంది.
సూళ్లూరుపేటకు 11మండలాలు: సూళ్లూరుపేట డివిజన్‌లో ఇప్పటిదాకా ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, తడ, సూళ్లూరుపేట, బీఎన్ కండ్రిగ, వరదయ్యపాళెం, సత్యవేడు మండలాలు ఉండగా, ఇప్పుడు వాకాడు, చిట్టమూరు చేరనున్నాయి.
శ్రీకాళహస్తికి అదనంగా మూడు: శ్రీకాళహస్తి డివిజన్లో ప్రస్తుతం శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట, కేవీబీ పురం, నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం మండలాలు ఉండగా, తాజాగా వెంకటగిరి, బాలాయపల్లి డక్కిలి చేరనున్నాయి.
తిరుపతికి 14మండలాలు: తిరుపతి డివిజన్లో ప్రస్తుతం తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం, పాకాల, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం, పుత్తూరు, వడమాలపేట మండలాలున్నాయి. ఇప్పుడు రైల్వే కోడూరు నియోజకవర్గం విలీనంతో ఆ ఐదు మండలాలూ (కోడూరు, ఓబులవారిపల్లి, చిట్వేలు, పుల్లంపేట, పెనగలూరు) ఈ డివిజన్లోకే రానున్నాయి. దీంతో మండలాల 14కు పెరగనుంది.