Share News

నేలపట్టులో విదేశీ పక్షుల దినోత్సవం

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:30 AM

నేలపట్టు పక్షుల కేంద్రంలో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా శనివారం విదేశీ పక్షుల దినోత్సవం నిర్వహించారు. దొరవారిసత్రం బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 70 మంది విద్యార్ధులకు విదేశీ పక్షుల విడిదిపై నేలపట్టు ఎఫ్‌ఆర్‌వో సౌజన్య అవగాహన కల్పించారు.

నేలపట్టులో విదేశీ పక్షుల దినోత్సవం
జర్మనీ పర్యాటకుడికి మొక్క అందజేస్తున్న ఎఫ్‌ఆర్‌వో సౌజన్య

దొరవారిసత్రం, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): నేలపట్టు పక్షుల కేంద్రంలో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా శనివారం విదేశీ పక్షుల దినోత్సవం నిర్వహించారు. దొరవారిసత్రం బీసీ గురుకుల పాఠశాలకు చెందిన 70 మంది విద్యార్ధులకు విదేశీ పక్షుల విడిదిపై నేలపట్టు ఎఫ్‌ఆర్‌వో సౌజన్య అవగాహన కల్పించారు. పక్షుల వల్ల ఈ ప్రాంతం ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు పొందడం, అవి రైతాంగానికి చేసే మేలు గురించి వివరించారు. పక్షుల జీవన విధానంపై విద్యార్ధులకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. శ్రీసిటీలో పనిచేసే నలుగురు జర్మనీ దేశస్థులు పక్షుల కేంద్రాన్ని పరిశీలించారు. పక్షుల విడిది ఇంకా మొదలు కాలేదని, ఈ వారంలో వచ్చే అవకాశాలున్నాయని వన్యప్రాణి సంరక్షణశాఖ అధికారులు వారికి తెలియజేశారు. కంపెనీ ఆవరణలో నాటాలని ఎఫ్‌ఆర్‌వో వారికి జమ్మి చెట్టు మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎఫ్‌ఎ్‌సవో బాలయ్య, ఎఫ్‌బీవో రాజేశ్వరి, టూరిజం గైడ్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 01:30 AM