రోజూ వ్యాయామం చేయండి
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:14 AM
రోజూ వ్యాయామం చేయండి.. ఆరోగ్యంగా ఉంటారని ఎస్పీ మణికంఠ చెప్పారు. సన్‌డే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని చిత్తూరు గాంధీ విగ్రహ కూడలి వద్ద ఆదివారం ఏఆర్ ఏఎస్పీ శివానంద కిశోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆధునిక సౌకర్యాల కారణంగా శారీరక చురుకుదనం కొరవడి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్నారు. రోజూ కనీసం 30 నిమిషాలపాటు సైకిల్ తొక్కడం ద్వారా శరీరానికి అవసరమైన వ్యాయామం లభిస్తుందన్నారు. మందులు వాడాల్సిన అవసరం ఉండదన్నారు. సైకిల్ ర్యాలీ ఎంఎ్‌సఆర్ కూడలి, చౌడేశ్వరమ్మ కూడలి, దర్గా కూడలి మీదుగా తిరిగి గాంధీ విగ్రహం కూడలి వద్దకు చేరుకుంది. ఎంటీవో చంద్రశేఖర్, ఆర్‌ఐ సుధాకర్, చిత్తూరు డీఎస్పీ సాయినాఽథ్, ఏఆర్ డీఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్ బాష, సీఐలు మహేశ్వర్, నెట్టికంఠయ్య, ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ, యువతీ యువకులు పాల్గొన్నారు.
సన్ డే ఆన్ సైకిల్ కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ
చిత్తూరు అర్బన్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): రోజూ వ్యాయామం చేయండి.. ఆరోగ్యంగా ఉంటారని ఎస్పీ మణికంఠ చెప్పారు. సన్‌డే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని చిత్తూరు గాంధీ విగ్రహ కూడలి వద్ద ఆదివారం ఏఆర్ ఏఎస్పీ శివానంద కిశోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆధునిక సౌకర్యాల కారణంగా శారీరక చురుకుదనం కొరవడి ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్నారు. రోజూ కనీసం 30 నిమిషాలపాటు సైకిల్ తొక్కడం ద్వారా శరీరానికి అవసరమైన వ్యాయామం లభిస్తుందన్నారు. మందులు వాడాల్సిన అవసరం ఉండదన్నారు. సైకిల్ ర్యాలీ ఎంఎ్‌సఆర్ కూడలి, చౌడేశ్వరమ్మ కూడలి, దర్గా కూడలి మీదుగా తిరిగి గాంధీ విగ్రహం కూడలి వద్దకు చేరుకుంది. ఎంటీవో చంద్రశేఖర్, ఆర్‌ఐ సుధాకర్, చిత్తూరు డీఎస్పీ సాయినాఽథ్, ఏఆర్ డీఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్ బాష, సీఐలు మహేశ్వర్, నెట్టికంఠయ్య, ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ, యువతీ యువకులు పాల్గొన్నారు.