ఉత్సాహంగా ఉట్లోత్సవం
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:19 AM
తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం ఉత్సాహభరిత వాతావరణంలో ఉట్లోత్సవం జరిగింది.
తిరుచానూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం ఉత్సాహభరిత వాతావరణంలో ఉట్లోత్సవం జరిగింది. అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి ఆలయంలో అర్చకులు గోకులాష్టమిని పురస్కరించుకుని విశేషాదిపూజా కార్యక్రమాలు నిర్వహించారు. రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామిని బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి వాహనం మండపంలో వేంచేపు చేశారు. అమ్మవారి ఆలయం ఎదుట టీటీడీ ఉద్యోగులు, అర్చకులు, సిబ్బంది ఉట్లోత్సవంలో పాల్గొన్నారు. యువత ఉత్సాహంతో ఉట్టి కొట్టారు. అనంతరం ఆస్థానంతో గోకులాష్టమి వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోహరీందర్‌నాథ్, శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి, మణికంఠస్వామి, సూపరింటెండెంట్ రమేష్, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు ప్రసాద్, చలపతి, సుబ్బరాయుడు, సుభాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.