Share News

నేటి నుంచి లెక్చరర్‌ పోస్టులకు పరీక్షలు

ABN , Publish Date - Jul 15 , 2025 | 02:05 AM

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో వివిధ లెక్చరర్‌ పోస్టులకు మంగళవారం నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఆర్వో నరసింహులు తెలిపారు. కలెక్టరేట్‌లో సంబంధిత శాఖ అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు.

నేటి నుంచి లెక్చరర్‌ పోస్టులకు పరీక్షలు

తిరుపతి(కలెక్టరేట్‌), జూలై 14(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో వివిధ లెక్చరర్‌ పోస్టులకు మంగళవారం నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఆర్వో నరసింహులు తెలిపారు. కలెక్టరేట్‌లో సంబంధిత శాఖ అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. ఈ నెల 23వ తేది వరకు ఆరు కేంద్రాల్లో.. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. 6,412మంది హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.

Updated Date - Jul 15 , 2025 | 02:05 AM