Share News

నౌకా నిర్మాణ నమూనా పరిశీలన

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:34 AM

వాకాడు మండలం తూపిలిపాళెం సముద్రతీరంలో నిర్మించనున్న నౌకానిర్మాణ డిజిటల్‌ నమూనాను ఇండస్ట్రియల్‌ ప్రధాన కార్యదర్శి యువరాజ్‌ శుక్రవారం జేసీ శుభం బన్సల్‌, సబ్‌ కలెక్టర్‌ రాఘవేంద్రమీనతో కలసి పరిశీలించారు.

నౌకా నిర్మాణ నమూనా పరిశీలన
నౌకా నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన నమూనాను పరిశీలిస్తున్న యువరాజ్‌ తదితరులు

వాకాడు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): వాకాడు మండలం తూపిలిపాళెం సముద్రతీరంలో నిర్మించనున్న నౌకానిర్మాణ డిజిటల్‌ నమూనాను ఇండస్ట్రియల్‌ ప్రధాన కార్యదర్శి యువరాజ్‌ శుక్రవారం జేసీ శుభం బన్సల్‌, సబ్‌ కలెక్టర్‌ రాఘవేంద్రమీనతో కలసి పరిశీలించారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ వారు తయారుచేసిన నమూనా గురించి తహసీల్దారు రామయ్య, మండల సర్వేయర్‌ శకుంతల వివరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్‌ పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 01:34 AM