Share News

సీఎం పర్యటనకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Jul 02 , 2025 | 02:03 AM

ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితంగా కనిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన మారింది. రాజకీయ వర్గాలతో సమన్వయం చేసుకుంటూ మారిన షెడ్యూల్‌ ప్రకారం ఆయన బుధవారం మధ్యాహ్నం శాంతిపురం మండలం చేరుకుని, గురువారం సాయంత్రం తిరుగు ప్రయాణం కానున్నారు.

సీఎం పర్యటనకు సర్వం సిద్ధం

నేడు, రేపు చంద్రబాబు కుప్పం పర్యటన

కుప్పం/శాంతిపురం, జులై 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితంగా కనిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన మారింది. రాజకీయ వర్గాలతో సమన్వయం చేసుకుంటూ మారిన షెడ్యూల్‌ ప్రకారం ఆయన బుధవారం మధ్యాహ్నం శాంతిపురం మండలం చేరుకుని, గురువారం సాయంత్రం తిరుగు ప్రయాణం కానున్నారు.తొలిరోజున టీడీపీ కార్యక్రమమైన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని తిమ్మరాజుపల్లెలో ప్రారంభించనుండగా, రెండవ రోజైన గురువారం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొనడంతోపాటు అధికార, రాజకీయ వర్గాలతో సమావేశం కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శాంతిపురం మండలం తుమ్మిశి రోడ్డులోని హెలిప్యాడ్‌కు బెంగళూరునుంచి చేరుకుంటారు. ఇక అక్కడినుంచి బయలుదేరి ఏపీ ఏపీ మోడల్‌ స్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. పంపిణీలు చేసిన అనంతరం స్వగృహం ఉన్న శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ తిమ్మరాజుపల్లె చేరుకుని ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.ఇందులో భాగంగా ముందుగానే నిర్ణయించిన 26 ఇళ్లకు వెళ్లి, వారిని పలకరించి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తారు. కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటారు. రాత్రికి స్వగృహంలో బస చేస్తారు. మళ్లీ గురువారం ఉదయం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి చేరుకుని డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం స్వగృహంలో నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తారు. అదయ్యాక టీడీపీ క్యాడర్‌తో సమావేశమై రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తారు. సాయంత్రం చంద్రబాబు తిరుగు ప్రయాణమవుతారు.

టీడీపీ క్యాడర్‌లో సమన్వయంకోసమే

స్థానిక ఎమ్మెల్యే కూడా అయిన చంద్రబాబు, గతంలో రెండు పర్యటనలకు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమవడం టీడీపీ శ్రేణుల్లో ఒకింత అసంతృప్తికి కారణమైంది. ఈసారి కూడా సీఎంగా మాత్రమే ఆయన వస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమవుతున్నారన్న ప్రచారం జరిగింది. కడా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల ఏర్పాట్లకోసం జిల్లా అధికార యంత్రాంగం హడావుడి ఎక్కువైంది. కేవలం అధికారుల కార్యక్రమంగానే రెండుమూడు రోజులనుంచి కనిపిస్తోంది. పార్టీ క్యాడర్‌ కానీ, నాయకులను కానీ పట్టించుకునేవారు లేకుండా పోయారు.ఇది క్యాడర్‌లో ఒకింత అసహనానికి కారణమైంది.అంతేకాక నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పార్టీ పరంగా ఉన్న 12 క్టస్టర్ల ఇన్‌చార్జులను మార్చి, కొత్తవారిని నియమిస్తూ సోమవారం జాబితా విడుదలైంది. ఉన్నపళంగా అందరినీ మార్చివేయడాన్ని సీనియర్లు కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ మొత్తం వ్యవహారం పార్టీ క్యాడర్‌లోని అసంతృప్తి అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లినట్లుంది. ఈ నేపథ్యంలోనే కుప్పం పర్యటన షెడ్యూల్‌, రెండు రోజులకు విస్తరించడమే కాక, పార్టీ శ్రేణులతో సమావేశాలను చేర్చుకుంటూ దిశ మార్చుకుందని పార్టీ వర్గాలంటున్నాయి.

ఫ సీఎం పర్యటన షెడ్యూల్‌

నేడు

ఫ 12.40 పీఎం - తుమ్మిశి రోడ్డులోని హెలిప్యాడ్‌కు చేరిక

ఫ 12.50 పీఎం- 01.30 పీఎం - రిజర్వ్‌డ్‌

ఫ 1.30 పీఎం - 3.00 పీఎం - తుమ్మిశి మోడల్‌ స్కూల్‌ సమీపంలో సభ

ఫ 3.00 పీఎం -4.00 పీఎం - వివిధ కంపెనీలతో ఎంఓయూలు, స్టాల్స్‌ సందర్శన

ఫ 4.35 పీఎం- 7.00 పీఎం - తిమ్మరాజుపల్లెలో ఇంటింటి ప్రచారం.

ఫ 7.05 పీఎం - కడపల్లె స్వగృహం చేరిక, రాత్రి బస

రేపు

ఫ 10.35 ఏఎం- 12.05 పీఎం - కుప్పం ఏరియా ఆస్పత్రిలో డీఐఎన్‌సీ ప్రారంభం

ఫ 12.15 పీఎం -1.30 పీఎం - స్వగృహంలో అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష

ఫ 1.30 పీఎం - 2.30 పీఎం - రిజర్వ్‌డ్‌

ఫ 2.30పీఎం -4.00 పీఎం -టీడీపీ శ్రేణులతో సమావేశం

ఫ 4.10 పీఎం - తుమ్మిశి రోడ్డులోని హెలిప్యాడ్‌కు చేరుకునితిరుగు ప్రయాణం.

Updated Date - Jul 02 , 2025 | 02:03 AM