Share News

సముద్రంలో ఈతకెళ్లి ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

ABN , Publish Date - Dec 22 , 2025 | 02:07 AM

సముద్రంలో ఈతకెళ్లి ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.

సముద్రంలో ఈతకెళ్లి ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి
ఒడ్డుకు కొట్టుకొచ్చిన యుగంధర్‌రెడ్డి మృతదేహం, యుగంధర్‌రెడ్డి (ఫైల్‌)

కోట, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో ఈతకెళ్లి ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు రూరల్‌ మండలం కొత్తవెల్లంటి గ్రామానికి చెందిన యుగంధర్‌రెడ్డి (21) గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఐదుగురు స్నేహితులతో కలసి కోట మండలం శ్రీనివాససత్రం బీచ్‌కు వచ్చాడు. కొంతసేపు బీచ్‌లో ఉల్లాసంగా గడిపారు. అనంతరం నలుగురు సముద్రంలో దిగి ఈత కొడుతుండగా అలల తాకిడికి సముద్రంలోకి వెళ్లిపోయారు. అందులో ముగ్గురు అలలతోపాటే సురక్షితంగా ఒడ్డుకు చేరారు. యుగంధర్‌రెడ్డి రాలేదు. స్థానిక మత్స్యకారులతో కలసి సముద్రం వెంబడి గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. గంట తర్వాత యుగంధర్‌రెడ్డి మృతదేహం ఒడ్డుకు చేరింది. దీంతో స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కోట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ పవన్‌కుమార్‌ తన సిబ్బందితో వచ్చి యుగంధర్‌రెడ్డి మృతదేహాన్ని కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విషయం తెలుసుకున్న యుగంధర్‌రెడ్డి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని బోరున విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది.

Updated Date - Dec 22 , 2025 | 02:08 AM