ముగిసిన వేనాడు దర్గా గంధోత్సవం
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:53 AM
తడ మండలం వేనాడులోని షేక్ దావూట్ షా వలీల్లాహ్ అల్లాతాత దర్గా గంధోత్సవం ముగిసింది. శనివారం రాత్రి నుంచి వర్షం కురుస్తున్నా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున వర్షం పడుతుండటంతో గంధాన్ని గ్రామంలో ఊరేగించలేదు.
తడ మండలం వేనాడులోని షేక్ దావూట్ షా వలీల్లాహ్ అల్లాతాత దర్గా గంధోత్సవం ముగిసింది. శనివారం రాత్రి నుంచి వర్షం కురుస్తున్నా భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున వర్షం పడుతుండటంతో గంధాన్ని గ్రామంలో ఊరేగించలేదు. దర్గా ప్రాంగణంలోనే ఉంచి ముస్లిం మత పెద్దలచే పూజలు చేశారు. ఆ తర్వాత గంఽధం, చాదర్‌ను బాబా సమాధి చుట్టూ ప్రదర్శనగా తీసుకొచ్చి ప్రార్థనల తర్వాత గంధాన్ని సమాధికి లేపనం చేసి పంచిపెట్టారు. గంధోత్సవంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సోదరి రెహనా బేగం, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తదితరులు దర్గాను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
- తడ, ఆంధ్రజ్యోతి