Share News

స్వచ్ఛ చిత్తూరుకు ప్రోత్సాహం

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:17 AM

చిత్తూరును స్వచ్ఛ నగరంగా అభివృద్ధి చేయడానికి స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా సహకారం అందిస్తామని స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరాం చెప్పారు.

స్వచ్ఛ చిత్తూరుకు ప్రోత్సాహం
కార్మికులను సన్మానిస్తున్న పట్టాభిరాం, జగన్మోహన్‌

స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరాం

చిత్తూరు అర్బన్‌, నవంబరు 3 (ఆంధ్రజోతి): చిత్తూరును స్వచ్ఛ నగరంగా అభివృద్ధి చేయడానికి స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా సహకారం అందిస్తామని స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరాం చెప్పారు. సోమవారం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌తో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధాన్ని అమలు చేయాలని,అదే సమయంలో బయో డీగ్రేడబుల్‌కవర్లు, క్లాత్‌బ్యాగులు, జ్యూట్‌ బ్యాగుల తయారీ, సరఫరాపై దృష్టి సారించాలన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మెప్మాతో సమన్వయం చేసుకుని బ్యాగుల విక్రయాలకు చర్యలు చేపడతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చెత్తను తరలించడానికి విద్యుత్‌ వాహనాలను అందుబాటులోకి తెస్తామన్నారు. కార్మికులందరికీ యాక్సిస్‌ బ్యాంకు ద్వారా రూ. 20 లక్షల ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లుచెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక పరిఽధిలో 16 ఎకరాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు రూ. 13 కోట్లతో పనులు చేపడుతున్నట్లు చెప్పారు.50 ఎలక్ర్టిక్‌ చెత్త తరలించే వాహనాలను అందిస్తామని, కంపాక్టర్లు, సీపింగ్‌ యంత్రాలను మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యే జగన్మోహన్‌ మాట్లాడుతూ స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇప్పుడిప్పుడే ప్రజల్లో మార్పు కన్పిస్తోందన్నారు.చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 01:17 AM