పొలాల్లో ఏనుగుల బీభత్సం
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:36 PM
చంద్రగిరి మండలం ఎ.రంగంపేట పరిధిలో మూడు రోజులుగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి
చంద్రగిరి, అక్టోబరు 22(ఆంద్రజ్యోతి): చంద్రగిరి మండలం ఎ.రంగంపేట పరిధిలో మూడు రోజులుగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున 9 ఏనుగుల గుంపు కందులవారిపల్లె, కూచువారిపల్లెలో అటవీ ప్రాంత సమీపంలోని పంట పొలాలపై విరుచుకుపడ్డాయి. వరి, అరటి, కొబ్బరి తోటలను తొక్కేశాయి. పెన్సింగ్‌ను, నీటి పైపులను కూడా ధ్వంసం చేశాయి. తర్వాత నాగపట్ల వెస్ట్ బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలోకి వెళ్ళాయి. ఏనుగుల దాడిపై అటవీశాఖ అధికారులకు రెతులు సమాచారమందించారు. వారు చేరుకుని ఏనుగులు గుంపును తరిమేందుకు బాణసంచా కాలుస్తూ, డప్పులు వాయించారు. రాత్రిపూట అప్రమత్తంగా ఉండాలని రైతులకు, ప్రజలకు అటవీ శాఖ అధికారులు సూచించారు.