గౌనిచెరువుకు ఏనుగులొచ్చాయ్
ABN , Publish Date - May 01 , 2025 | 01:52 AM
తాగునీటి కోసం బంగారుపాళ్యం మండలం గౌనిచెరువులోకి రెండు ఏనుగులు వచ్చాయి.వేసవితాపానికి తట్టుకోలేక సమీప అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు మొగిలి సమీపంలోని గౌనిచెరువులోకి మంగళవారం సాయంత్రం వచ్చాయి.
బంగారుపాళ్యం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): తాగునీటి కోసం బంగారుపాళ్యం మండలం గౌనిచెరువులోకి రెండు ఏనుగులు వచ్చాయి.వేసవితాపానికి తట్టుకోలేక సమీప అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు మొగిలి సమీపంలోని గౌనిచెరువులోకి మంగళవారం సాయంత్రం వచ్చాయి.కాసేపు జలకాలాడి తిరిగి అటవీ ప్రాంతానికి వెళ్లే క్రమంలో కాసేపు బురదలో చిక్కుకుపోయాయి. బయటపడే ప్రయత్నంలో ఘీంకారాలు చేయడాన్ని స్థానికులు ఫోన్లతో దూరం నుంచి వీడియోలు తీశారు. ఈ వీడియోలు చూసిన కొంతమంది ఏనుగులు బురదలో కూరుకుపోయి బయటపడలేక ఇబ్బంది పడుతున్నాయని ప్రచారం చేశారు.