నవంబరు నుంచి విద్యుత్ చార్జీల తగ్గింపు
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:08 AM
విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.తిరుపతి విద్యుత్ సర్కిల్ పరిధిలో 9,26,150 మందికి నవంబరు నుంచి గతంలో అధికంగా వసూలు చేసిన రూ.63.19 కోట్ల ట్రూఅప్ చార్జీలను తిరిగి చెల్లించడానికి రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్‌ఈ వి.చంద్రశేఖరరావు, ఎస్‌ఏవో ఎ.శ్రీనివాసులు తెలిపారు.
తిరుపతి(ఆటోనగర్), అక్టోబరు4(ఆంధ్రజ్యోతి):విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.తిరుపతి విద్యుత్ సర్కిల్ పరిధిలో 9,26,150 మందికి నవంబరు నుంచి గతంలో అధికంగా వసూలు చేసిన రూ.63.19 కోట్ల ట్రూఅప్ చార్జీలను తిరిగి చెల్లించడానికి రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్‌ఈ వి.చంద్రశేఖరరావు, ఎస్‌ఏవో ఎ.శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఎస్‌ఈ కార్యాలయంలో వారు మాట్లాడుతూ గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వినియోగదారుల నుంచి ఎఫ్‌పీపీసీఏ చార్జీలు (ట్రూఅప్ చార్జీలు)గా వసూలు చేసిన మొత్తంలో విద్యుత్ కొనుగోలు ధరల సర్దుబాటు(ఎఫ్‌పిపిసీఎ)కు పోను మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ఈ సర్ధుబాటు నవంబరు నుంచి వచ్చే ఏడాది అక్టోబరు వరకూ ప్రతినెలా వినియోగ బిల్లుల్లో తగ్గిస్తారని చెప్పారు.