Share News

ఎలక్ట్రిక్‌ బస్సుల్ని ఘాట్‌లో తిప్పాల్సిందే

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:14 AM

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వంద ఎలక్ట్రిక్‌ బస్సులనూ ఘాట్‌లోనే తిప్పాలని ఆర్టీసీ ఈడీలు చెంగల్‌రెడ్డి, చంద్రశేఖర్‌ ఆదేశించారు. మదనపల్లె, నెల్లూరు, కడపలకు తిరుగుతున్న బస్సులనూ తిరుమలకు నడపాలన్నారు.

ఎలక్ట్రిక్‌ బస్సుల్ని ఘాట్‌లో తిప్పాల్సిందే
మాట్లాడుతున్న ఈడీలు చెంగల్‌రెడ్డి, చంద్రశేఖర్‌, డీపీటీవో జగదీష్‌

తిరుపతి(ఆర్టీసీ), సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వంద ఎలక్ట్రిక్‌ బస్సులనూ ఘాట్‌లోనే తిప్పాలని ఆర్టీసీ ఈడీలు చెంగల్‌రెడ్డి, చంద్రశేఖర్‌ ఆదేశించారు. మదనపల్లె, నెల్లూరు, కడపలకు తిరుగుతున్న బస్సులనూ తిరుమలకు నడపాలన్నారు. తిరుపతిలో సోమవారం వీరు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్త్రీశక్తి పథకం నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. గరుడసేవకు నిమిషానికొక బస్సు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో డీపీటీవో జగదీష్‌, డిప్యూటీ సీటీఎం విశ్వనాథం, సీఎంఈ బాలాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 01:14 AM