శ్రీకాళహస్తిలో గ్రహణ కాల అభిషేకం
ABN , Publish Date - Sep 08 , 2025 | 01:18 AM
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం అర్ధరాత్రి గ్రహణ కాలం పురస్కరించుకుని మూలమూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించారు. రాత్రి 9గంటల వరకు ఆలయాన్ని యఽథావిఽధిగా తెరచి ఉంచి భక్తులకు రోజులాగే దర్శనం కల్పించారు. గ్రహణ కాలం అర్ధరాత్రి వేళ కావడంతో ఆ సమయంలో అభిషేకాలను ఏకాంతంగా నిర్వహించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం అర్ధరాత్రి గ్రహణ కాలం పురస్కరించుకుని మూలమూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించారు. రాత్రి 9గంటల వరకు ఆలయాన్ని యఽథావిఽధిగా తెరచి ఉంచి భక్తులకు రోజులాగే దర్శనం కల్పించారు. గ్రహణ కాలం అర్ధరాత్రి వేళ కావడంతో ఆ సమయంలో అభిషేకాలను ఏకాంతంగా నిర్వహించారు. వారాంతపు సెలవులు కావడంతో కావడంతోపాటు చంద్రగ్రహణం రోజున ముక్కంటి ఆలయం మాత్రమే తెరవడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 25వేలమంది దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 76, రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 3,817మంది, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 2,425మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 3,461మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,250, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 440మంది, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 375మంది, రూ.5వేల టిక్కెట్ల ద్వారా 141మంది పూజలుచేయించుకున్నారు.
- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి