Share News

డ్వాక్రా సభ్యులకు రూ.11లక్షల టోకరా

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:20 AM

డ్వాక్రా సంఘాలకు చెందిన రూ.11లక్షలకుపైగా మొత్తాన్ని ఓ సంఘమిత్ర స్వాహా చేసిన ఘటన బయటపడింది. వివరాలిలా.. తిరుపతి రూరల్‌ మండలం కుంట్రపాకం పంచాయతీలోని ఎస్టీకాలనీలో మూడు డ్వాక్రా సంఘాలున్నాయి. ఈ సభ్యులకు తెలియకుండా రూ.11లక్షలకు పైగా సొమ్మును విడతలవారీగా సంఘమిత్ర చెంచులక్ష్మి తీసుకున్నారు.

డ్వాక్రా సభ్యులకు రూ.11లక్షల టోకరా

తిరుపతిరూరల్‌, సెప్టెంబరు22(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా సంఘాలకు చెందిన రూ.11లక్షలకుపైగా మొత్తాన్ని ఓ సంఘమిత్ర స్వాహా చేసిన ఘటన బయటపడింది. వివరాలిలా.. తిరుపతి రూరల్‌ మండలం కుంట్రపాకం పంచాయతీలోని ఎస్టీకాలనీలో మూడు డ్వాక్రా సంఘాలున్నాయి. ఈ సభ్యులకు తెలియకుండా రూ.11లక్షలకు పైగా సొమ్మును విడతలవారీగా సంఘమిత్ర చెంచులక్ష్మి తీసుకున్నారు. అడిగినప్పుడల్లా బ్యాంకులో చెల్లించామని చెప్పేవారు. వార్షిక బడ్జెట్‌- జీవనోపాధుల ప్రణాళికలో బయోమెట్రిక్‌ వేసిన సందర్భంలో బ్యాంకులో అప్పు ఉన్నట్లు సభ్యులు గుర్తించారు. అనుమానంతో బ్యాంకు పుస్తకాలను తీసుకురమ్మంటే సంఘమిత్ర దాటవేత ధోరణితో సమాధానం చెప్పేవారు. దీంతో బ్యాంకు స్టేట్‌మెంట్‌ పరిశీలించగా రూ.11లక్షలకుపైగా స్వాహా చేసినట్లు గుర్తించారు. దీనిని ‘మనడబ్బులు- మనలెక్కలు’ యాప్‌ ద్వారా ధ్రువీకరించుకున్నారు. దీనిపై మండల వెలుగు ఏపీఎం నాగేశ్వరరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. రూ.11లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించామన్నారు. విచారణ జరిపి. రికవరీకి చర్యలు చేపడతామన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 01:20 AM