సవరించిన టెట్ మార్కులతో డీఎస్సీ స్కోర్ కార్డులు
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:42 AM
సవరించిన టెట్ మార్కులతో డీఎస్సీ స్కోర్ కార్డులను బుధవారం రాత్రి నుంచి అభ్యర్థులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఏపీ మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
చిత్తూరు సెంట్రల్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సవరించిన టెట్ మార్కులతో డీఎస్సీ స్కోర్ కార్డులను బుధవారం రాత్రి నుంచి అభ్యర్థులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఏపీ మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏవైనా అభ్యంతరాలుంటే, అభ్యర్థి ఐడీ నెంబరు ద్వారా వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపర్చాలని సూచించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తుది స్కోర్ కార్డులు విడుదల కానున్నాయి.