ముగిసిన డీఎస్సీ పరీక్షలు
ABN , Publish Date - Jul 04 , 2025 | 01:43 AM
చిత్తూరు, చెన్నైలోని ఎనిమిది కేంద్రాల్లో జూన్ ఆరో తేదీన ప్రారంభమైన మెగా డీఎస్సీ పరీక్షలు బుధవారంతో ముగిశాయి.రాష్ట్రవ్యాప్తంగా 16,347 పోస్టులు కాగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,478 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం రెండు విభాగాలుగా దరఖాస్తులు వచ్చాయి. జనరల్ కేటగిరీలో 1,324, దివ్యాంగుల కేటగిరీలో 149 పోస్టులు కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఒక్కో అభ్యర్థి ఒక్క పోస్టుకు మించి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 26,501 మంది నుంచి 45,221 దరఖాస్తులు వచ్చాయి. సకాలంలో ఫీజు చెల్లించకపోవడం, నమోదులో లోపాలు, అర్హత లేకపోవడం, ఇతరత్రా కారణాలతో 2,701 మంది దరఖాస్తులు తిరస్కరణకుగురయ్యాయి. 23,500 మంది పరీక్షలు రాయాల్సి ఉంది.అయితే మరిన్ని కారణాలతో 21,340 మంది పరీక్షలు రాయడానికి అర్హత సాధించారు. చివరకు 19,550 మంది పరీక్షలు రాశారు. ప్రతి పరీక్ష తర్వాత రెండ్రోజుల్లో ‘కీ’ని విడుదల చేశారు. మరో ఏడు రోజుల్లో ఫైనల్ ‘కీ’ విడుదల కానుంది. ఆపై డీఎస్సీ మార్క్స్ మెమో విడుదల చేయనున్నారు.
21,340 మందికి హాజరైంది 19,550 మంది
ఏడు రోజుల్లో ఫైనల్ ‘కీ’ విడుదల
చిత్తూరు సెంట్రల్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు, చెన్నైలోని ఎనిమిది కేంద్రాల్లో జూన్ ఆరో తేదీన ప్రారంభమైన మెగా డీఎస్సీ పరీక్షలు బుధవారంతో ముగిశాయి.రాష్ట్రవ్యాప్తంగా 16,347 పోస్టులు కాగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,478 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం రెండు విభాగాలుగా దరఖాస్తులు వచ్చాయి. జనరల్ కేటగిరీలో 1,324, దివ్యాంగుల కేటగిరీలో 149 పోస్టులు కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఒక్కో అభ్యర్థి ఒక్క పోస్టుకు మించి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 26,501 మంది నుంచి 45,221 దరఖాస్తులు వచ్చాయి. సకాలంలో ఫీజు చెల్లించకపోవడం, నమోదులో లోపాలు, అర్హత లేకపోవడం, ఇతరత్రా కారణాలతో 2,701 మంది దరఖాస్తులు తిరస్కరణకుగురయ్యాయి. 23,500 మంది పరీక్షలు రాయాల్సి ఉంది.అయితే మరిన్ని కారణాలతో 21,340 మంది పరీక్షలు రాయడానికి అర్హత సాధించారు. చివరకు 19,550 మంది పరీక్షలు రాశారు. ప్రతి పరీక్ష తర్వాత రెండ్రోజుల్లో ‘కీ’ని విడుదల చేశారు. మరో ఏడు రోజుల్లో ఫైనల్ ‘కీ’ విడుదల కానుంది. ఆపై డీఎస్సీ మార్క్స్ మెమో విడుదల చేయనున్నారు.