జాతరకు డ్రోన్ల నిఘా
ABN , Publish Date - Sep 10 , 2025 | 02:54 AM
వెంకటగిరి జాతరకు ఈసారి ఐదు డ్రోన్లతో నింగి నుంచీ నిఘా పెట్టనున్నారు. ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలూ ప్రతి సంఘటననూ క్యాప్చర్ చేయనున్నాయి. గత ఐదేళ్ల అనుభవాలు, ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎస్పీ హర్షవర్ధనరాజు భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే అదనపు ఎస్పీ రవిమనోహరాచ్చారి, ఎస్బీ డీఎస్పీ వెంకటనారాయణ, సీఐలు, ఎస్‌ఐలు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి, స్థానిక నాయకులతో సమావేశమై జాతర ఏర్పాట్లపై చర్చించారు. బుధ, గురువారాల్లో పోలేరమ్మ జాతరకు 950 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్టీఎఫ్.. మూవింగ్ పార్టీలనూ నియమించారు. జాతరలో ఊరేగింపుతో పాటు నిమజ్జనం, భక్తుల తాకిడి ఎక్కువగా వున్న ప్రాంతాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లు ఏర్పాటుచేసి భక్తులకు అవగాహన కల్పించేలా సిబ్బందిని నియమించారు. మరరోవైపు గూడూరు డివిజన్ పరిధిలోని ఆకతాయిలు, రౌడీ షీటర్లు, మద్యం మత్తులో గొడవలు సృష్టించే వారిని బైండోవర్ చేసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. భక్తుల వాహనాలకు 8 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. వాహనాలన్నీ వచ్చే దారిలోనే తిరిగి వెళ్లేలా రూట్ మ్యాప్‌లు సిద్ధం చేశారు.
జాతరకు డ్రోన్ల నిఘా
950 మంది పోలీసు బలగాలతో బందోబస్తు
తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): వెంకటగిరి జాతరకు ఈసారి ఐదు డ్రోన్లతో నింగి నుంచీ నిఘా పెట్టనున్నారు. ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలూ ప్రతి సంఘటననూ క్యాప్చర్ చేయనున్నాయి. గత ఐదేళ్ల అనుభవాలు, ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎస్పీ హర్షవర్ధనరాజు భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే అదనపు ఎస్పీ రవిమనోహరాచ్చారి, ఎస్బీ డీఎస్పీ వెంకటనారాయణ, సీఐలు, ఎస్‌ఐలు ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి, స్థానిక నాయకులతో సమావేశమై జాతర ఏర్పాట్లపై చర్చించారు. బుధ, గురువారాల్లో పోలేరమ్మ జాతరకు 950 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్టీఎఫ్.. మూవింగ్ పార్టీలనూ నియమించారు. జాతరలో ఊరేగింపుతో పాటు నిమజ్జనం, భక్తుల తాకిడి ఎక్కువగా వున్న ప్రాంతాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లు ఏర్పాటుచేసి భక్తులకు అవగాహన కల్పించేలా సిబ్బందిని నియమించారు. మరరోవైపు గూడూరు డివిజన్ పరిధిలోని ఆకతాయిలు, రౌడీ షీటర్లు, మద్యం మత్తులో గొడవలు సృష్టించే వారిని బైండోవర్ చేసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. భక్తుల వాహనాలకు 8 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. వాహనాలన్నీ వచ్చే దారిలోనే తిరిగి వెళ్లేలా రూట్ మ్యాప్‌లు సిద్ధం చేశారు.
తోక జాడిస్తే జైలుకే
ప్రశాంతంగా జాతర నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎవరైనా విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తే జైలుకు పంపిస్తాం. రద్దీ ఎక్కువగా ఉండే చోట డ్రోన్లు వినియోగించి ఆకతాయిల ఆగడాలను కట్టడి చేస్తాం. గతేడాది జాతరలో అల్లర్లు సృష్టించిన వారి కదిలికలపై నిఘా ఉంచాం.
- హర్షవర్ధనరాజు, ఎస్పీ