Share News

మందుబాబు ఆన్‌ డ్యూటీ!

ABN , Publish Date - May 31 , 2025 | 01:30 AM

పలమనేరులో శుక్రవారం మద్యం మత్తులో ఓ యువకుడు ట్రాఫిక్‌ పోలీసు అవతారం ఎత్తాడు. పట్టణంలోని గుడియాత్తం క్రాస్‌ వద్ద నాలుగురోడ్ల కూడలి మధ్యలో ఉదయం 11 గంటల ప్రాంతంలో 15నిమిషాలు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఇచ్చాడు.

మందుబాబు ఆన్‌ డ్యూటీ!
పలమనేరులోని గుడియాత్తం క్రాస్‌ వద్ద నాలుగురోడ్ల కూడలిలో ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేస్తున్న మందుబాబు

పలమనేరులో శుక్రవారం మద్యం మత్తులో ఓ యువకుడు ట్రాఫిక్‌ పోలీసు అవతారం ఎత్తాడు. పట్టణంలోని గుడియాత్తం క్రాస్‌ వద్ద నాలుగురోడ్ల కూడలి మధ్యలో ఉదయం 11 గంటల ప్రాంతంలో 15నిమిషాలు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఇచ్చాడు. మఫ్టీలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసేమో అని కొందరు అనుమానించి దగ్గరగా వెళ్లి చూసి మందుబాబు అని తెలిసి విస్తుపోయారు. ఈ కూడలిలో సాధారణంగా ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేసేందుకు ఓ కానిస్టేబుల్‌ వుంటారు. అయితే ఆ కానిస్టేబుల్‌ లేని సమయంలో ఇలా జరగడంతో స్థానికులు విస్తుపోయారు.

-పలమనేరు, ఆంధ్రజ్యోతి

Updated Date - May 31 , 2025 | 01:30 AM