నష్టాల బాటలో దోస రైతులు
ABN , Publish Date - Apr 10 , 2025 | 02:30 AM
ఎన్నో ఆశలు పెట్టుకుని సాగు చేసిన దోస పంటకు ధరల్లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.రొంపిచెర్ల మండలంలో వెయ్యి ఎకరాల్లో టమోటా సాగు చేసిన రైతులు దోసపంటను 840 ఎకరాల్లో సాగు చేశారు. మోటుమల్లెల, గానుగచింత,పెద్దమల్లెల,బొమ్మయ్యగారిపల్లె పంచాయతీల్లో దోస సాగు చేసిన రైతులు గత ఏడాది లాభాలు గడించారు.దీంతో ఈ ఏడాది పంట విస్తీర్ణం మరింత పెంచారు.అయితే ధరలు తగ్గిపోవడంతో ఉసూరుమం టున్నారు.ఎకరా దోస సాగుకు కూలీలు, దున్నకాలు, మల్చింగ్‌షీట్, ఎరువులు, మందులు తదితరాలకు రూ. 90వేల నుంచి రూ.లక్ష వరకు అవుతోందని రైతులు చెబుతున్నారు.దీంతోపాటు ఎకరాకు 250 గ్రాముల విత్తనాలు అవసరం. మార్కెట్‌లో కిలో విత్తనాలు రూ.55వేలు పలుకుతోంది.డ్రిప్ వైరు 4కట్టలు అవసరముండగా కట్ట రూ.1500 పలుకుతోంది. పంట దిగుబడుల ప్రారంభదశలో రూ.20 వేలు పలికిన టన్ను పంట ధర ఉన్నపళంగా రూ.5వేలకు పడిపోయింది. కూలీలు కూడా గిట్టుబాటు కాకపోవడంతో కొంతమంది రైతులు పంటను పొలంలోనే వదిలేశారు. మరి కొంత మంది వాహనాల్లో వేసుకొని సంతల్లో, పట్టణాల్లో తిరిగి అమ్ముకుంటున్నారు. కొంత ఆలస్యంగా పంట సాగు చేసిన రైతులు తమ పరిస్థితి ఎలా వుంటుందో అని ఆందోళనలు చెందుతున్నారు.

రొంపిచెర్ల, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి):ఎన్నో ఆశలు పెట్టుకుని సాగు చేసిన దోస పంటకు ధరల్లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.రొంపిచెర్ల మండలంలో వెయ్యి ఎకరాల్లో టమోటా సాగు చేసిన రైతులు దోసపంటను 840 ఎకరాల్లో సాగు చేశారు. మోటుమల్లెల, గానుగచింత,పెద్దమల్లెల,బొమ్మయ్యగారిపల్లె పంచాయతీల్లో దోస సాగు చేసిన రైతులు గత ఏడాది లాభాలు గడించారు.దీంతో ఈ ఏడాది పంట విస్తీర్ణం మరింత పెంచారు.అయితే ధరలు తగ్గిపోవడంతో ఉసూరుమం టున్నారు.ఎకరా దోస సాగుకు కూలీలు, దున్నకాలు, మల్చింగ్‌షీట్, ఎరువులు, మందులు తదితరాలకు రూ. 90వేల నుంచి రూ.లక్ష వరకు అవుతోందని రైతులు చెబుతున్నారు.దీంతోపాటు ఎకరాకు 250 గ్రాముల విత్తనాలు అవసరం. మార్కెట్‌లో కిలో విత్తనాలు రూ.55వేలు పలుకుతోంది.డ్రిప్ వైరు 4కట్టలు అవసరముండగా కట్ట రూ.1500 పలుకుతోంది. పంట దిగుబడుల ప్రారంభదశలో రూ.20 వేలు పలికిన టన్ను పంట ధర ఉన్నపళంగా రూ.5వేలకు పడిపోయింది. కూలీలు కూడా గిట్టుబాటు కాకపోవడంతో కొంతమంది రైతులు పంటను పొలంలోనే వదిలేశారు. మరి కొంత మంది వాహనాల్లో వేసుకొని సంతల్లో, పట్టణాల్లో తిరిగి అమ్ముకుంటున్నారు. కొంత ఆలస్యంగా పంట సాగు చేసిన రైతులు తమ పరిస్థితి ఎలా వుంటుందో అని ఆందోళనలు చెందుతున్నారు.గతంలో ఇక్కడి పంట తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంత వ్యాపారస్తులు కొనేవారు. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో కూడా పంట సాగవుతుండడంతో వ్యాపారులు ఇక్కడికి రావడం లేదు.దీనికి తోడు పంట విస్తీర్ణం కూడా పెరగడంతో ధరలు పడిపోయినట్లు చెబుతున్నారు.
పంట దిగుబడి బాగా వచ్చింది.
రంజాన్ మాసంలో డిమాండ్ పెరిగి మంచి లాఽబాలు వస్తాయని ఆశించాం.అయితే మా అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
ధరల్లేకపోవడంతో నష్టాలే మిగిలాయి.
- జ్యోతినాధ్,పెద్దకురవపల్లె
నాకున్న నాలుగు ఎకరాల్లో దోస సాగు చేశా. ఎకరానికి రూ.లక్ష వరకు ఖర్చయింది.ప్రస్తుతమైతే ధరల్లేవు. అలస్యంగా సాగు చేశాను దిగుబడులు వచ్చే సమయం దగ్గర పడుతోంది.అప్పటికి మంచి ధరలు వస్తాయని ఆశిస్తున్నా.
-సిద్ధయ్య, దుస్సావారిపల్లె
ఈ ఏడాది దోస సాగు రెండు రెట్లు పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా దోస సాగు సమృద్ధిగా వుండడంతో ఎగుమతులు తగ్గాయి.దీనికి తోడు ఇక్కడ పంట దిగుబడులన్నీ ఒకే సమయంలో రావడంతో ధరలు పతనమయ్యాయి.
- సంతోషికుమారి, ఉద్యానశాఖాధికారిణి