Share News

టీటీడీ ట్రస్టులకు రూ.30.1 లక్షల విరాళం

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:51 AM

టీటీడీ ట్రస్టులకు సోమవారం రూ.30.10 లక్షలు విరాళంగా అందాయి. బెంగళూరుకు చెందిన చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ ఎస్‌ఎన్‌వీఎల్‌ నరసింహరాజు తరపున మోహన్‌ కుమార్‌ రెడ్డి తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి రూ.20 లక్షల విరాళం చెక్‌ను అందజేశారు.

టీటీడీ ట్రస్టులకు రూ.30.1 లక్షల విరాళం
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం చెక్‌ను అందజేస్తున్న మోహన్‌ కుమార్‌ రెడ్డి

తిరుమల, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): టీటీడీ ట్రస్టులకు సోమవారం రూ.30.10 లక్షలు విరాళంగా అందాయి. బెంగళూరుకు చెందిన చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ ఎస్‌ఎన్‌వీఎల్‌ నరసింహరాజు తరపున మోహన్‌ కుమార్‌ రెడ్డి తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి రూ.20 లక్షల విరాళం చెక్‌ను అందజేశారు. ఇందులో రూ.10 లక్షలు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు, మరో రూ.10 లక్షలు ప్రాణదానం ట్రస్టుకు వినియోగించాలని దాత కోరారు. అలాగే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు కడప జిల్లా సీఆర్‌ అసోసియేట్స్‌ సంస్థ అధినేత చరణ్‌తేజ్‌ రూ.10.10లక్షలు విరాళంగా అందజేశారు.

Updated Date - Aug 12 , 2025 | 01:51 AM