దీపావళి సందడి
ABN , Publish Date - Oct 20 , 2025 | 01:38 AM
పండగ అంటేనే పెల్లుబికే ఆనందం. అందునా దీపావళి అంటే పిల్లల ముఖాలన్నీ దివ్వెల్లా వెలిగి పోతాయి. చిత్తూరు నగరంలో ఆదివారం ఎటుచూసినా దీపావళి కళ కనిపించింది. టపాసుల అంగళ్ల వద్ద పిల్లల కోలాహలం.. పూలంగళ్ల వద్ద ఆడవాళ్ల హడావుడి.. కిటకిటలాడుతూ గుడ్డలంగళ్లు.. చర్చివీధి, బజారువీధి, డీఐరోడ్డు, ప్రకాశం హైరోడ్డు జనంతో నిండిపోయాయి. కట్టమంచిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాలు జనంతో కిక్కిరిసాయి. డీఎస్పీ సాయినాథ్, డీఎ్‌ఫవో పెద్దిరెడ్డి, ఏడీఎ్‌ఫవో కరుణాకర్ టపాకాయల దుకాణాలవద్ద పర్యవేక్షించారు.
చిత్తూరు సిటీ, ఆంధ్రజ్యోతి: పండగ అంటేనే పెల్లుబికే ఆనందం. అందునా దీపావళి అంటే పిల్లల ముఖాలన్నీ దివ్వెల్లా వెలిగి పోతాయి. చిత్తూరు నగరంలో ఆదివారం ఎటుచూసినా దీపావళి కళ కనిపించింది. టపాసుల అంగళ్ల వద్ద పిల్లల కోలాహలం.. పూలంగళ్ల వద్ద ఆడవాళ్ల హడావుడి.. కిటకిటలాడుతూ గుడ్డలంగళ్లు.. చర్చివీధి, బజారువీధి, డీఐరోడ్డు, ప్రకాశం హైరోడ్డు జనంతో నిండిపోయాయి. కట్టమంచిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాలు జనంతో కిక్కిరిసాయి. డీఎస్పీ సాయినాథ్, డీఎ్‌ఫవో పెద్దిరెడ్డి, ఏడీఎ్‌ఫవో కరుణాకర్ టపాకాయల దుకాణాలవద్ద పర్యవేక్షించారు.