Share News

దిత్వా ఎఫెక్ట్‌ ఏడు మండలాల్లో భారీ వర్షం

ABN , Publish Date - Dec 04 , 2025 | 02:10 AM

జిల్లాను తరచూ తుఫాన్‌లు వెంటాడుతున్నాయి. నిన్నగాక మొన్న మొంథా తుఫాన్‌ మిగిల్చిన నష్టాలకు పరిహారం కూడా అందక మునుపే దిత్వా తుఫాన్‌ దూసుకొచ్చింది. వాయుగుండం నుంచి అల్ప పీడనంగా బలహీనపడినప్పటికీ జిల్లాపై మాత్రం ప్రభావం కనబరిచింది. గత నెల 30న తుఫాన్‌ ప్రభావం మొదలైనప్పటికీ మొదటి మూడు రోజులూ మోస్తరు వానలే కురిశాయి. అయితే మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ 22.30 గంటల వ్యవధిలోనే ఏడు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వందలాది ఎకరాల్లో వరి పొలాలు నీటమునిగాయి. కూరగాయల పంటలు సైతం అక్కడక్కడా దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం తమకు 270 ఎకరాల్లో మాత్రమే వరిపొలాలు నీట మునిగినట్టు సమాచారం వచ్చిందని తెలిపారు. ఏడు మండలాల్లో భారీ వర్షాలు దిత్వా తుఫాన్‌ ప్రభావంతో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 6 గంటల నడుమ జిల్లాలోని సముద్రతీర ప్రాంత ఏడు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాకాడు మండలంలో రికార్డు స్థాయిలో 280 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొరుగునే ఉన్న చిట్టమూరు మండలంలో సైతం 261.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కోట మండలంలో 220, దొరవారిసత్రం మండలంలో 135.8, నాయుడుపేటలో 115.2, ఓజిలిలో 109.4, తడలో 93.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. దిత్వా తుఫాన్‌ ప్రభావం గత నెల 30వ తేదీనే మొదలైనా ఆ రోజున కనిష్టంగా 4.8 మి.మీ.లు, గరిష్టంగా 45.2 మి.మీ.లు చొప్పున, ఈనెల 1న కనిష్టంగా 1.4 మి.మీ.లు, గరిష్టంగా 45.6 మి.మీ.లు వంతున, 2న ఉదయం 8.30 వరకూ అత్యల్పంగా 2 మిల్లీమీటర్లు, అత్యధికంగా 52.6 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదవగా తర్వాతి 22.30 గంటల వ్యవధిలో తీర ప్రాంత మండలాల్లో రికార్డు స్థాయి వర్షాలు పడ్డాయి. ఈ భారీ వర్షాలకు స్వర్ణముఖి, కాళంగి, కైవల్య సహా పలు నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

దిత్వా ఎఫెక్ట్‌  ఏడు మండలాల్లో భారీ వర్షం
చిల్లకూరు మండలం పారిచర్లవారిపాలెం వద్ద నీట మునిగిన వరిపొలాలు

- వాకాడులో రికార్డు స్థాయిలో 28 సెంటీమీటర్ల వర్షపాతం

- వందలాది ఎకరాల్లో నీట మునిగిన వరి పొలాలు

- గోడ కూలి వృద్ధురాలి మృతి

- నీటి ఉధృతికి కొట్టుకుపోయిన మొలకలపూడి రోడ్డు

- పునబాక వద్ద బురదలో కూరుకుపోయిన ఆర్టీసీ బస్సు

- నెలబల్లి చెరువు తూముకు గండ్లు

తిరుపతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాను తరచూ తుఫాన్‌లు వెంటాడుతున్నాయి. నిన్నగాక మొన్న మొంథా తుఫాన్‌ మిగిల్చిన నష్టాలకు పరిహారం కూడా అందక మునుపే దిత్వా తుఫాన్‌ దూసుకొచ్చింది. వాయుగుండం నుంచి అల్ప పీడనంగా బలహీనపడినప్పటికీ జిల్లాపై మాత్రం ప్రభావం కనబరిచింది. గత నెల 30న తుఫాన్‌ ప్రభావం మొదలైనప్పటికీ మొదటి మూడు రోజులూ మోస్తరు వానలే కురిశాయి. అయితే మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ 22.30 గంటల వ్యవధిలోనే ఏడు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వందలాది ఎకరాల్లో వరి పొలాలు నీటమునిగాయి. కూరగాయల పంటలు సైతం అక్కడక్కడా దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం తమకు 270 ఎకరాల్లో మాత్రమే వరిపొలాలు నీట మునిగినట్టు సమాచారం వచ్చిందని తెలిపారు.

ఏడు మండలాల్లో భారీ వర్షాలు

దిత్వా తుఫాన్‌ ప్రభావంతో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 6 గంటల నడుమ జిల్లాలోని సముద్రతీర ప్రాంత ఏడు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాకాడు మండలంలో రికార్డు స్థాయిలో 280 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొరుగునే ఉన్న చిట్టమూరు మండలంలో సైతం 261.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కోట మండలంలో 220, దొరవారిసత్రం మండలంలో 135.8, నాయుడుపేటలో 115.2, ఓజిలిలో 109.4, తడలో 93.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. దిత్వా తుఫాన్‌ ప్రభావం గత నెల 30వ తేదీనే మొదలైనా ఆ రోజున కనిష్టంగా 4.8 మి.మీ.లు, గరిష్టంగా 45.2 మి.మీ.లు చొప్పున, ఈనెల 1న కనిష్టంగా 1.4 మి.మీ.లు, గరిష్టంగా 45.6 మి.మీ.లు వంతున, 2న ఉదయం 8.30 వరకూ అత్యల్పంగా 2 మిల్లీమీటర్లు, అత్యధికంగా 52.6 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదవగా తర్వాతి 22.30 గంటల వ్యవధిలో తీర ప్రాంత మండలాల్లో రికార్డు స్థాయి వర్షాలు పడ్డాయి. ఈ భారీ వర్షాలకు స్వర్ణముఖి, కాళంగి, కైవల్య సహా పలు నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

ప్రమాదాలు... స్తంభించిన రాకపోకలు

- పెళ్లకూరు మండలం పాలచ్చూరు దళితవాడలో ఓజిలి మణెమ్మకు చెందిన రేకుల ఇల్లు కూలిపోయింది. పునబాక వద్ద శ్రీకాళహస్తి-నాయుడుపేట ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బురదలో కూరుకుపోయింది. మామిడి కాలువ ఉధృతికి పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెంబేడు చెరువు కట్ట ప్రమాదకర స్థితికి చేరుకుంది. నెలబల్లి చెరువు తూముకు ఇరువైపులా గండ్లు పడ్డాయి. రైతులు ఇసుక బస్తాలతో వాటిని పూడ్చే పనిలో పడ్డారు.

- తొట్టంబేడు మండలం కాసరంలో ఇంటి గోడ కూలి వృద్ధురాలు మృతిచెందింది. గ్రామానికి చెందిన రేణుకమ్మ(60) గుడిసెలో నిద్రిస్తుండగా గోడ కూలడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

- గూడూరు మండలం విందూరులో విద్యుత్‌ స్తంభం కూలి పడటంతో ఆటో ధ్వంసమైంది.

- కోట మండలం చెందోడు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నీట మునిగింది.

- చిట్టమూరు మండలం మొలకలపూడి రోడ్డు వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. రొయ్యల కాలువ ఉధృతికి మల్లాం-నాయుడుపేట మార్గంలో రాకపోకలు బంద్‌ అయ్యాయి. తీర ప్రాంత గ్రామాలైన బురదగాలి, కొత్తపాలెం, కుమ్మరపాలెం గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.

- వాకాడు మండలంలో రొయ్యలకాలువ పొంగడంతో ముట్టెంబాక - చిట్టమూరు రోడ్డు తెగిపోయింది. స్వర్ణముఖి ఉధృతికి బాలిరెడ్డిపాలెం వద్ద వంతెనపైకి వరద నీరు చేరడంతో 16 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వాయిలపాలెం నుంచి కొండూరుకు వెళ్లే రోడ్డుపైకి వరద నీరు రావడంతో రాకపోకలు నిలిపివేశారు.

- గూడూరు - రాజంపేట రోడ్డు వర్షానికి దారుణంగా దెబ్బతింది.

- కోట మండలం రుద్రవరం వద్ద మామిడి కాలువ పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

- చిల్లకూరు మండలం పారిచర్లవారిపాలెం వద్ద వరద నీరు కాజ్‌వే పైకి రావడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఉప్పుటేరు పొంగి కాజ్‌వేపై ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తిప్పగుంటపాలెం జల దిగ్బంధంలో చిక్కుకుంది.

- బాలాయపల్లి మండలం నిండలి సమీపంలో కైవల్యానది ప్రవాహం బ్రిడ్జిపైకి రావడంతో నిండలి, వాక్యం, దగ్గవోలు తదితర గ్రామాలకు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకూ రాకపోకలు ఆగిపోయాయి.

- తడ మండలం పూడి గ్రామంలోకి నీరు ప్రవేశించింది. కారిజాత చెరువుకు గండిపడింది. దీంతో రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

ఉధృతంగా ప్రవాహాలు

- కోట మండలం గోవిందపల్లి వద్ద బకింగ్‌ హామ్‌ కెనాల్‌ పొంగి ప్రవహిస్తోంది.

- గూడూరు పంబలేరు చప్టాపై వరద నీరు ప్రవహిస్తోంది. వేములపాలెం చప్టాపై కూడా వరద నీటి ప్రవాహం మొదలైంది. విందూరు సమీపంలో రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. గూడూరు వద్ద కైవల్యా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

- కోట మండలంలో స్వర్ణముఖి నది ఉధృతికి ఆనకట్టల నుంచి నీరు పరవళ్లు తొక్కుతున్నాయి.

- దొరవారిసత్రం తనియాలి వద్ద కాళంగి వంతెనపై వరద ప్రవాహం జోరందుకుంది. వెదురుపట్టు రోడ్డులో పాలకాలువ పొంగడంతో వంతెనపైకి వరద నీరు చేరింది. పూలతోట సమీపంలో సూళ్లూరుపేట-వాకాడు రోడ్డు వంతెనపై కన్న కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళంగి నది, పాల కాలువ, నెర్రి కాలువ, కన్న కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

- వాకాడు మండలం దుగరాజపట్నం నుంచి కొండూరుపాళెం వెళ్లే రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. వాకాడు స్వర్ణముఖి బ్యారేజీలోకి 14 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా 11 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు

- తడ మండలం కాదలూరు, వెండ్లూరుపాడు, మాంబట్టు, కారిజాత, కొండూరు, గ్రద్దగుంట గ్రామాల్లో వెయ్యి ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి.

- గూడూరు చల్లకాలువ సమీపంలో పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. పంటలు నీట మునిగాయి.

- చిట్టమూరు మండలం కొత్తగుంటలో వరినాట్లు నీట మునిగాయి.

- పెళ్లకూరు మండలం చిల్లకూరు, పెళ్లకూరు, పునబాక, కొత్తరు, అక్కగారిపేట, టెంకాయతోపు, భీమవరం, నెలబల్లి గ్రామాల్లో వందల ఎకరాల వరిపొలాలు నీటిపాలయ్యాయి.

- చిల్లకూరు మండలం పారిచర్ల వద్ద పంట పొలాల్లోకి నీరు ప్రవేశించింది.

- సూళ్లూరుపేట మండలం కొరిడి, పేర్నాడు, దామరాయి, మంగళంపాడు, మన్నే ముత్తేరి గ్రామాల్లో పంటపొలాలు నీట మునిగాయి.

- కోట మండలం వెంకన్నపాలెం, తిమ్మానాయుడుపాలెం గ్రామాల్లో పంట పొలాలన్నీ నీట మునిగాయి.

- ఓజిలి మండలం పున్నేపల్లి-సుగుటూరు రోడ్డులో మామిడి కాలువ పొంగడంతో కాపులూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

- కేవీబీపురం మండలంలో పూడి గ్రామాలకు వెళ్లే సిమెంటు పైపులతో ఏర్పాటు చేసిన మట్టి వంతెన మళ్లీ కొట్టుకుపోయింది.

Updated Date - Dec 04 , 2025 | 02:10 AM