Share News

జిల్లా కేంద్రమా.. నెల్లూరులో విలీనమా?

ABN , Publish Date - Dec 02 , 2025 | 02:00 AM

గూడూరును జిల్లా చేస్తారా? లేదా నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తారా? ఈ రెండింటిలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ జేఏసీ నేతలు డిమాండు చేశారు.

జిల్లా కేంద్రమా.. నెల్లూరులో విలీనమా?
ర్యాలీ నిర్వహిస్తున్న జేఏసీ నాయకులు

ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ గూడూరులో జేఏసీ నిరసన

గూడూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): గూడూరును జిల్లా చేస్తారా? లేదా నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తారా? ఈ రెండింటిలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ జేఏసీ నేతలు డిమాండు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. వర్షంలోనూ టవర్‌క్లాక్‌సెంటర్‌ నుంచి రైల్వేస్టేషన్‌, సంఘం థియేటర్‌, రాజావీధి మీదుగా టవర్‌క్లాక్‌సెంటర్‌ వద్దకు చేరుకుని మానవహారం ఏర్పాటు చేశారు. గూడూరును తిరుపతిలో కలపడంతో జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా నెల్లూరుతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ ఇటు విలీనం చేయాలన్నారు. తద్వారా ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. గూడూరు ప్రజల ఆకాంక్షను నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టంచేశారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఏవో శిరీషకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పవన్‌, దశరధరామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వేగూరు రాజేంద్రప్రసాద్‌, బాలకృష్ణంరాజు, మోహన్‌దా్‌స, చిరంజీవి, జమాలుల్లా, కోడూరు మీరారెడ్డి, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 02:00 AM