ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ టికెట్ల కొనుగోలుకు భక్తుల పాట్లు
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:47 AM
తిరుమల శ్రీవారి ఆర్జితసేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్ల కోనుగోలుకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాఽధారణంగా అదనపు ఈవో కార్యాలయంలో సిఫార్సు లేఖలు సమర్పించిన అనంతరం కేటాయింపు మెసెజ్ భక్తుల సెల్‌ఫోన్‌కు వస్తుంది.
పనిచేయని పేమెంట్ గేట్‌వే, మాన్యువల్‌గా కేటాయింపు
తిరుమల, డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆర్జితసేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్ల కోనుగోలుకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాఽధారణంగా అదనపు ఈవో కార్యాలయంలో సిఫార్సు లేఖలు సమర్పించిన అనంతరం కేటాయింపు మెసెజ్ భక్తుల సెల్‌ఫోన్‌కు వస్తుంది. మెసేజ్‌లోని లింక్ ఆధారంగా పేమెంట్ చేస్తే టికెట్లు డౌన్‌లోడ్ అవుతాయి. అయితే టీటీడీ నుంచి నిర్ధారణ మెసేజ్‌లు భక్తులకు చేరినప్పటికీ పేమెంట్ చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో భక్తులు టికెట్లు ఎలా పొందాలో తెలియక కంగారు పడ్డారు. అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, ఎంబీసీ34లోని కౌంటర్ల ద్వారా మాన్యువల్‌గా పొందవచ్చని సూచన చేశారు. దీంతో భక్తులు వర్షంలోనే ఇబ్బంది పడుతూ క్యూలైన్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేయాల్సి వచ్చింది. సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే నగదు చెల్లింపులలో ఇబ్బందులు ఎదురయ్యాయని అధికారులు తెలిపారు.