Share News

సీబీఎ్‌సకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Sep 29 , 2025 | 01:12 AM

గరుడసేవ చూసేందుకు వచ్చిన భక్తులతో ఆదివారం ఉదయం నుంచే తిరుపతి సెంట్రల్‌ బస్సు స్టేషన్‌ రద్దీగా మారింది. నిమిషానికో బస్సు వస్తున్నా సరిపోలేదు. బస్సుల్లో సీట్ల కోసం పోటీపడ్డారు. ఇక, కౌంటర్లో ఆరుగురు కండక్టర్లు టిక్కెట్లు జారీచేస్తున్నా భక్తులు క్యూలో బారులు తీరారు.

సీబీఎ్‌సకు పోటెత్తిన భక్తులు

తిరుపతి(ఆర్టీసీ), సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): గరుడసేవ చూసేందుకు వచ్చిన భక్తులతో ఆదివారం ఉదయం నుంచే తిరుపతి సెంట్రల్‌ బస్సు స్టేషన్‌ రద్దీగా మారింది. నిమిషానికో బస్సు వస్తున్నా సరిపోలేదు. బస్సుల్లో సీట్ల కోసం పోటీపడ్డారు. ఇక, కౌంటర్లో ఆరుగురు కండక్టర్లు టిక్కెట్లు జారీచేస్తున్నా భక్తులు క్యూలో బారులు తీరారు. రైల్వేస్టేషన్‌, విష్ణునివాసం వద్దా ఇదే పరిస్థితి. ఈ రెండు పాయింట్ల వద్దే బస్సులు నిండిపోవడంతో తిరుమల బైపాస్‌ రోడ్డులో స్థానికులు.. అలిపిరి బాలాజీ బస్టాండులోనూ భక్తులకు నిరీక్షణ తప్పలేదు. డిప్యూటీ సీటీఎం విశ్వనాధం బస్టాండులోనే తిష్టవేసి రద్దీని సమీక్షిస్తూ బస్సులను రప్పించారు. అదనపు మరుగుదొడ్ల సౌకర్యం లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సకాలంలో వ్యర్థాలు తొలగించకపోవడంతో కుండీలు నిండి.. దుర్గంధం నెలకొంది. సాయంత్రం 6 గంటల వరకు 88,872 మంది తిరుమలకు వెళ్లగా.. 61,184మంది కొండ దిగారు.

Updated Date - Sep 29 , 2025 | 01:12 AM