Share News

అభివృద్ధి ప్రదాత.. సంక్షేమ విధాత సీఎం చంద్రబాబు!

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:32 AM

ఉమ్మడి రాష్ట్రానికి, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సైతం అభివృద్ధి ప్రదాత, సంక్షేమ విధాతగా నిలిచింది ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎ్‌స.మునిరత్నం అన్నారు.

అభివృద్ధి ప్రదాత.. సంక్షేమ విధాత సీఎం చంద్రబాబు!
కుప్పంలో కేక్‌ కట్‌ చేసి నినాదాలు చేస్తున్న టీడీపీ శ్రేణులు

కుప్పం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రానికి, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు సైతం అభివృద్ధి ప్రదాత, సంక్షేమ విధాతగా నిలిచింది ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎ్‌స.మునిరత్నం అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి 30 ఏళ్లు పూర్తయిన సంర్భాన్ని పురస్కరించుకుని కుప్పం టీడీపీ కార్యాలయంలో సోమవారం టీడీపీ శ్రేణులు సంబరాలు జరిపాయి. భారీ కేక్‌ కట్‌ చేసి అధినేతకు శుభాకాంక్షలు తెలిపాయి.ఈ సందర్భంగా పీఎ్‌సఎం మాట్లాడుతూ పార్టీ, రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు 1995 లో తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు అప్రతిహతంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారన్నారు.టీడీపీ కుప్పం మున్సిపల్‌, కుప్పం మండల అధ్యక్షులు రాజ్‌ కుమార్‌, ప్రేమ్‌కుమార్‌, రెస్కో చైర్మన్‌ వీజీ.ప్రతాప్‌, కుప్పం వ్యవసాయ మార్కెట్టు కమిటీ చైర్మన్‌ వీజీ.ప్రతాప్‌, టీటీడీ బోర్డు సభ్యుడు వైద్యం శాంతారాం తదితరులు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని విజయపథంలో పయనిస్తున్నదంటే అందుకు అధినేత చంద్రబాబే కారణమని పేర్కొన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్‌ సత్యేంద్ర శేఖర్‌, మాజీ ఎంపీపీ డాక్టర్‌ వెంకటేశ్‌, టీడీపీ నియోజకవర్గ విస్తరణ కమిటీ సభ్యుడు కన్నన్‌, అప్పు ముఖేశ్‌, కాణిపాకం వెంకటేశ్‌, సర్దార్‌ బాషా, చలపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 01:32 AM