Share News

రూ.10వేల కోట్లతో మున్సిపాలిటీల అభివృద్ధి

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:08 AM

అమృత్‌ పథకం ద్వారా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు.

రూ.10వేల కోట్లతో మున్సిపాలిటీల అభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నారాయణ

గూడూరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): అమృత్‌ పథకం ద్వారా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాశిం సునీల్‌కుమార్‌, నెలవల విజయశ్రీ, కురుగొండ రామకృష్ణతో కలిసి మున్సిపల్‌ కమిషనర్లతో సమీక్షించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. గూడూరు మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాకు అమృత్‌ పథకం కింద రూ.73 కోట్లు మంజూరయ్యాయన్నారు. డ్రైన్లను అభివృద్ధి పరిచేందుకు రూ.28 కోట్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే, సూళ్లూరుపేట మున్సిపాలిటీకి రూ.218 కోట్లు, నాయుడుపేటకు రూ.173 కోట్లు, వెంకటగిరికి రూ.120 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, మున్సిపల్‌ కమిషనర్లు వెంకటేశ్వర్లు, ఫజులుల్లా, చిన్నయ్య, వెంకట్రామిరెడ్డి, నాయకులు శీలం కిరణ్‌కుమార్‌, పులిమి శ్రీనివాసులు, వాటంబేడు శివకుమార్‌, మట్టం శ్రావణి, గురవయ్య, నరసింహులు, శ్రీధర్‌, కల్పన, భారతి, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2025 | 12:08 AM