అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండా
ABN , Publish Date - May 23 , 2025 | 02:05 AM
అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం జిల్లాస్థాయి మహానాడును నిర్వహించారు.
జిల్లా మహానాడు సభలో ఎంపీ ప్రసాదరావు
చిత్తూరు సిటీ, మే 22 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో గురువారం జిల్లాస్థాయి మహానాడును నిర్వహించారు.దేశరక్షణ కోసం పోరాడుతూ మరణించిన జవాన్లకు, వివిధ కారణాలతో ఇటీవల మృతి చెందిన టీడీపీ నేతలకు, కార్యకర్తలకు తొలుత నివాళులర్పించారు. సభలో ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. తిరుపతి - కాట్పాడి డబుల్ లైన్ ఏర్పాటుకు కేంద్రం రూ.1,332 కోట్లు మంజూరు చేసిందని, ఈ లైన్ ఏర్పాటైతే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఆగుతాయని తెలిపారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో రూ.60 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు.పార్టీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు సీఆర్ రాజన్ మాట్లాడుతూ ఈనెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించనున్న మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, కలికిరి మురళీమోహన్, గాలి భానుప్రకాష్, మాజీ ఎమ్మెల్సీలు దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు ఏఎస్ మనోహర్, గాంధీ, చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత, మేయర్ అముద, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సురేంద్రకుమార్, సప్తగిరి ప్రసాద్, నేతలు చంద్రప్రకాష్, చిట్టిబాబు, కోదండయాదవ్, మోహన్‌రాజ్, త్యాగరాజన్, రామచంద్ర నాయుడు, అశోకన్, కార్జాల అరుణ, నాగేశ్వరరావు, దశరథ వాసు తదితరులు పాల్గొన్నారు.
మహానాడులో 26 తీర్మానాలు
ఫ సెంట్రల్ మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి.మామిడి పంటకు గిట్టుబాటు ధర ఇప్పించాలిఫ 2014-19 నడుమ ఉపాధి, నీరు చెట్టు పథకాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను 24 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలిఫగత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన పక్కా గృహాలు, రూరల్ హౌసింగ్ ఇళ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరడం. ఫ వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలిఫ చంద్రగిరి మండలంలోని ఐతేపల్లె నుంచి రంగంపేటవరకు ఉన్న స్వర్ణముఖి నదిపై, తిరుపతిరూరల్ మండలంలోని వేదాంతపురం నుంచి రాయలచెరువుమీదుగా పచ్చికాపలం, కొత్తపల్లె మిట్ట స్వర్ణముఖి నదిపై హైలెవల్ వంతెనల నిర్మాణం చేపట్టాలిఫచెరువులు, కుంటలు, ఇరిగేషన్ కాలువల్లో పూడిక తీయడానికి నిధులు కేటాయించాలిఫ భూముల రీ సర్వేలో జరిగిన తప్పిదాలను జాప్యం లేకుండా సవరించడంఫజిల్లా నుంచి పక్క రాష్ట్రాల్లోని ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేయడంఫ జిల్లా కేంద్రాన్ని పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేయాలి.