Share News

స్విమ్స్‌లో స్టాఫ్‌ నర్సుల నియామకానికి నిర్ణయం

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:29 AM

తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆధ్వర్యంలో స్విమ్స్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమీక్ష జరిగింది. 236మంది స్టాఫ్‌ నర్సులు, 20మంది పారా మెడికల్‌ సిబ్బందితో పాటు 48 అడ్మినిస్ర్టేటివ్‌ పోస్టుల భర్తీకి గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

స్విమ్స్‌లో స్టాఫ్‌ నర్సుల నియామకానికి నిర్ణయం

తిరుమల,నవంబరు18(ఆంధ్రజ్యోతి): తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆధ్వర్యంలో స్విమ్స్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమీక్ష జరిగింది. 236మంది స్టాఫ్‌ నర్సులు, 20మంది పారా మెడికల్‌ సిబ్బందితో పాటు 48 అడ్మినిస్ర్టేటివ్‌ పోస్టుల భర్తీకి గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. డైరెక్ట్‌ రిక్రూట్మెంట్‌ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించారు. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ప్రశాంతిరెడ్డి, సదాశివరావు, స్విమ్స్‌ డైరెక్టర్‌ ఆర్వీ కుమార్‌ పాల్గొన్నారు.

టీటీడీ డైరీ, క్యాలెండర్లు ఉచితంగా వద్దు

టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఉచితంగా తీసుకోరాదని బీఆర్‌. నాయుడు నిర్ణయించుకున్నారు. చైర్మన్‌ హోదాలో ఉన్నవారికి కొన్ని డైరీలు, క్యాలెండర్లను టీటీడీ ఉచితంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అదే పద్ధతిలో చైర్మన్‌కు పంపిన 2026 డైరీ, క్యాలెండర్లను బీఆర్‌ నాయడు తిరస్కరించారు.గత ఏడాదిలాగే తనకు అవసరమైనవాటిని కొనుగోలు చేస్తానని తెలిపారు.

Updated Date - Nov 19 , 2025 | 12:29 AM