హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఛైర్మన్‌గా దాసరి శ్రీనివాసులు
ABN , Publish Date - Aug 22 , 2025 | 02:55 AM
రాష్ట్ర హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఛైర్మన్‌గా దాసరి శ్రీనివాసులు నియమితులయ్యారు. తిరుపతికి చెందిన ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. గతేడాది జనవరి 10వ తేదీన ట్రస్టు ఛైర్మన్‌గా నియమితులైన బొమ్మదేవ వెంకట సుబ్బారావు పదవీకాలం వచ్చే ఏడాది జనవరి దాకా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆయన స్థానంలో దాసరి శ్రీనివాసులును నియమించింది.
బొమ్మదేవర వెంకటసుబ్బారావు స్థానంలో నియమించిన ప్రభుత్వం
తిరుపతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఛైర్మన్‌గా దాసరి శ్రీనివాసులు నియమితులయ్యారు. తిరుపతికి చెందిన ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. గతేడాది జనవరి 10వ తేదీన ట్రస్టు ఛైర్మన్‌గా నియమితులైన బొమ్మదేవ వెంకట సుబ్బారావు పదవీకాలం వచ్చే ఏడాది జనవరి దాకా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆయన స్థానంలో దాసరి శ్రీనివాసులును నియమించింది. దీంతో బొమ్మదేవర వెంకటసుబ్బారావు పదవీకాలాన్ని ప్రభుత్వం అర్ధంతరంగా రద్దు చేసినట్టయింది. కొత్తగా నియమితులైన దాసరి శ్రీనివాసులు ట్రస్టు ఛైర్మన్‌గా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయశాఖ కార్యదర్శి జి.జయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ పరిధిలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టును 2015లో ఏర్పాటు చేసింది. దీనికి వివిధ ఆలయాల నుంచీ కామన్ గుడ్ ఫండ్ ద్వారా నిధుల కేటాయింపు జరుగుతోంది. హిందూ ధర్మాన్ని, ఆచార వ్యవహారాలను, సంస్కృతీ సాంప్రదాయాలను ప్రచారం చేయడం, ప్రోత్సహించడం ఈ ట్రస్టు ఏర్పాటు ఉద్దేశాలు.