Share News

ఉద్యోగం ఎరతో సైబర్‌ టోకరా

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:01 AM

ఉద్యోగం వస్తుందనే ఆశతో సైబర్‌ ఉచ్చులో పడి మోసపోయాడో వ్యక్తి. రూ.17.99 లక్షలు పోగొట్టుకున్నాడు. ఎస్‌ఐ లోకే్‌షబాబు కథనం మేరకు..ఈ ఏడాది జూన్‌లో ప్రియా అనే పేరుతో పేస్‌బుక్‌ ద్వారా బాధితునికి ఓవ్యక్తి పరిచయమయ్యాడు.

ఉద్యోగం ఎరతో సైబర్‌ టోకరా

రూ.17.99 లక్షలకు ఎసరు

తిరుపతి (నేరవిభాగం)నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఉద్యోగం వస్తుందనే ఆశతో సైబర్‌ ఉచ్చులో పడి మోసపోయాడో వ్యక్తి. రూ.17.99 లక్షలు పోగొట్టుకున్నాడు. ఎస్‌ఐ లోకే్‌షబాబు కథనం మేరకు..ఈ ఏడాది జూన్‌లో ప్రియా అనే పేరుతో పేస్‌బుక్‌ ద్వారా బాధితునికి ఓవ్యక్తి పరిచయమయ్యాడు. టెలిగ్రామ్‌ గ్రూపులు, వాట్సాప్‌ నెంబర్ల ద్వారా ఉద్యోగ ఆఫర్లున్నాయని నమ్మించాడు. మొదట రిజిస్ర్టేషన్‌ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్‌, రూమ్‌ చార్జీలు, జీఎస్టీటీ, ఎస్‌జీఎస్టీటీ వంటి మాటలు చెప్పి పలు సార్లు డబ్బులు జమ చేయించుకున్నాడు. తర్వాత ఫోటోలు, సంతకం తీసుకుని ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసి బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెట్డాడు. ఇలా 171 ఆన్‌లైన్‌ లావాదేవీల ద్వారా రూ.17.99 లక్షల మేర జమ చేయించుకున్నాడు. తిరిగి డబ్బులు ఇవ్వమంటే అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తూ వచ్చాడు. చివరికి తాను సైబర్‌ వలలో పడి మోసపోయానని గుర్తించిన బాధితుడు సోమవారం అలిపిరి పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 04 , 2025 | 01:01 AM