భక్తజనసంద్రం.. ముక్కంటి ఆలయం
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:29 AM
శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వారాంతపు, వేసవి సెలవులు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.

శ్రీకాళహస్తీశ్వరాలయం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. వారాంతపు, వేసవి సెలవులు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 28వేల మంది దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం 663 మంది, రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 3,046, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 2,761 మంది దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 2,878 మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 1,391, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 471, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 310, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 138 మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఐదు రకాల ప్రసాదాలు కలిపి 20,473 విక్రయించినట్టు అధికారులు తెలిపారు.
- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి