514 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:22 AM
మొంథా తుఫాను కారణంగా జిల్లాలో 13 మండలాల్లోని 83 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి.వీటిలో 362మంది రైతులు 514 ఎకరాల్లో సాగు చేసిన వరి, వేరుశనగ, ఉద్యాన పంటలు వున్నాయి.
చిత్తూరు సెంట్రల్, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను కారణంగా జిల్లాలో 13 మండలాల్లోని 83 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి.వీటిలో 362మంది రైతులు 514 ఎకరాల్లో సాగు చేసిన వరి, వేరుశనగ, ఉద్యాన పంటలు వున్నాయి. ఇందులో 334 మంది రైతులు 475 ఎకరాల్లో సాగు చేసిన వరి, వేరుశనగ పంటలుండగా, సదుం, చౌడేపల్లె, సోమల, పుంగనూరు, గంగవరం, చిత్తూరు మండలాల్లోని 28 మంది రైతులు 39 ఎకరాల్లో సాగు చేసిన బొప్పాయి, టమోటా, పొద్దుతిరుగుడు, పువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. జీడీ నెల్లూరు మండలంలోని రెండు గ్రామాల్లో 10.6 ఎకరాలు, సోమల మండలంలోని ఓ గ్రామంలో 5 ఎకరాలు, తవణంపల్లె మండలంలోని 4 గ్రామాల్లో 6.5 ఎకరాలు, వెదురుకుప్పం మండలంలోని 8 గ్రామాల్లో 38.25 ఎకరాలు, ఎస్‌ఆర్‌పురం మండలంలోని ఓ గ్రామంలో 2 ఎకరాలు, పూతలపట్టు మండలంలోని 12 గ్రామాల్లో 37.5 ఎకరాలు, పెనుమూరు మండలంలో 146 ఎకరాలు, యాదమరి మండలంలోని 9గ్రామాల్లో 14.25 ఎకరాలు, గుడిపాల మండలంలోని 15 గ్రామాల్లో 162.5 ఎకరాల వరి పైరు దెబ్బతింది. సదుంమండలంలోని ఓ గ్రామంలో ఎకరా, బంగారుపాళ్యం మండలంలోని 7 గ్రామాల్లో 21.5 ఎకరాలు, ఐరాల మండలంలోని 8 గ్రామాల్లో 28 ఎకరాలు, పాలసముద్రం మండలంలోని మూడు గ్రామాల్లో 3.5 ఎకరాల్లో వరి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది.