Share News

కష్టాల కొలిమిలో నుంచి పుట్టుకొచ్చిన సీపీఐ

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:11 AM

కష్టాల కొలిమిలో నుంచి సీపీఐ పుట్టుకొచ్చిందని జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

కష్టాల కొలిమిలో నుంచి పుట్టుకొచ్చిన సీపీఐ
సభలో ప్రసంగిస్తున్న నారాయణ

నగరి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కష్టాల కొలిమిలో నుంచి సీపీఐ పుట్టుకొచ్చిందని జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. నగరిలో జిల్లాస్థాయి మహాసభలు జరుగుతున్న విషయం తెలిసిందే. రెండోరోజైన ఆదివారం ప్రతినిధుల సభ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి జనార్దన్‌ గత మహాసభల నుంచి ఇప్పటివరకు అమరులైన వారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. సమాజంలో పెట్టుబడి, శ్రామికవర్గాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. సీపీఐ అణగారిన వర్గాల కోసం పోరాటాలు చేస్తూనే ఉంటుందన్నారు. పీ-4 పథకంతో పేదరికాన్ని పారదోలే ఆలోచన కంటే వారికి ఉపాధి అవకాశాలు కల్పించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. చిత్తూరులో రౌడీలను తరిమికొట్టిన ఘనత తమకే దక్కుతుందన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యవర్గ సభ్యుడు రామానాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి హరినాథరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 23వ తేదీన ఒంగోలులో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేయడం సీఎం చంద్రబాబు తీరుకు నిదర్శనమని విమర్శించారు. కోదండయ్య, విజయగౌరి, ప్రవీణ్‌, నాగరాజన్‌, పెంచలయ్య, గుర్రప్ప, హరిబాబు, డప్పు సూరి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:12 AM