కూటమిలో కోవర్టులు!
ABN , Publish Date - Jun 20 , 2025 | 01:54 AM
తిరుపతి ఎన్డీఏ కూటమిలో కోవర్టుల భయం పట్టుకుంది. నగరపాలక సంస్థకు చెందిన ఓ స్థలాన్ని విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై జరిగిన కౌన్సిల్ సమావేశంలో కొందరు కార్పొరేటర్ల వ్యవహారశైలి తీవ్ర చర్చకు దారితీసింది. వైసీపీ కండువా తీసి కూటమి కండువాలు కప్పుకున్నారు గానీ గత పార్టీ భావజాలం మాత్రం అలాగే ఉందనే వాదన కౌన్సిల్ సమావేశంలో స్పష్టమైంది. అధికార పార్టీతో ఉంటే అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చనే స్వార్థంతోనే కండువాలు వేసుకుని కొందరు, వేసుకోకుండా మరికొందరు తిరుగుతున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. కార్పొరేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు కూటమి మద్దతు కార్పొరేటర్లు ప్రతిపక్ష పార్టీ నిర్ణయానికి అనుకూలంగా కనిపించి కూటమి నేతలకు షాక్ ఇచ్చారు. సాక్షాత్తు కౌన్సిల్ ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా హాజరైన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎదుటే కూటమి నిర్ణయానికి అడ్డుతగలడం ఆశ్చర్యానికి గురిచేసింది. సమావేశం అనంతరం ఎమ్మెల్యే కూడా కార్పొరేటర్ల వ్యవహారశైలిపై నాయకుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కౌన్సిల్ సమావేశానికి ముందురోజే తిరుపతిని అమ్మేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వ పెద్దలను తిట్టిపోస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే డిప్యూటీ మేయర్లు, కూటమిలోని మహిళా కార్పొరేటర్లు మినహా గట్టిగా గొంతెత్తి ఖండించాల్సిన సీనియర్ కార్పొరేటర్లు మాత్రం సెటైర్లు వేసుకోవడం ఎమ్మెల్యేని నివ్వెరపరిచింది. అయినప్పటికీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడే సమయంలోనూ వైసీపీని ఖండించని కార్పొరేటర్లనే పక్కన పెట్టుకున్నారు. కూటమిలో విలువ, స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ కొందరు ఇంకా వైసీపీ బంధం నుంచి బయటపడకపోవడంలేదన్న అనుమానాలు బలపడుతున్నాయి. వైసీపీ నేతల కనుసన్నల్లోనే సదరు కార్పొరేటర్లు పనిచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
- కౌన్సిల్ సమావేశంలో బట్టబయలు
- ఆలోచనలో పడ్డ నేతలు
తిరుపతి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): తిరుపతి ఎన్డీఏ కూటమిలో కోవర్టుల భయం పట్టుకుంది. నగరపాలక సంస్థకు చెందిన ఓ స్థలాన్ని విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై జరిగిన కౌన్సిల్ సమావేశంలో కొందరు కార్పొరేటర్ల వ్యవహారశైలి తీవ్ర చర్చకు దారితీసింది. వైసీపీ కండువా తీసి కూటమి కండువాలు కప్పుకున్నారు గానీ గత పార్టీ భావజాలం మాత్రం అలాగే ఉందనే వాదన కౌన్సిల్ సమావేశంలో స్పష్టమైంది. అధికార పార్టీతో ఉంటే అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చనే స్వార్థంతోనే కండువాలు వేసుకుని కొందరు, వేసుకోకుండా మరికొందరు తిరుగుతున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. కార్పొరేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు కూటమి మద్దతు కార్పొరేటర్లు ప్రతిపక్ష పార్టీ నిర్ణయానికి అనుకూలంగా కనిపించి కూటమి నేతలకు షాక్ ఇచ్చారు. సాక్షాత్తు కౌన్సిల్ ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా హాజరైన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎదుటే కూటమి నిర్ణయానికి అడ్డుతగలడం ఆశ్చర్యానికి గురిచేసింది. సమావేశం అనంతరం ఎమ్మెల్యే కూడా కార్పొరేటర్ల వ్యవహారశైలిపై నాయకుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కౌన్సిల్ సమావేశానికి ముందురోజే తిరుపతిని అమ్మేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వ పెద్దలను తిట్టిపోస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే డిప్యూటీ మేయర్లు, కూటమిలోని మహిళా కార్పొరేటర్లు మినహా గట్టిగా గొంతెత్తి ఖండించాల్సిన సీనియర్ కార్పొరేటర్లు మాత్రం సెటైర్లు వేసుకోవడం ఎమ్మెల్యేని నివ్వెరపరిచింది. అయినప్పటికీ కౌన్సిల్ సమావేశం అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడే సమయంలోనూ వైసీపీని ఖండించని కార్పొరేటర్లనే పక్కన పెట్టుకున్నారు. కూటమిలో విలువ, స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ కొందరు ఇంకా వైసీపీ బంధం నుంచి బయటపడకపోవడంలేదన్న అనుమానాలు బలపడుతున్నాయి. వైసీపీ నేతల కనుసన్నల్లోనే సదరు కార్పొరేటర్లు పనిచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కూటమిలో కోవర్టులను పెట్టుకుని రాజకీయాలు ఎలా చేయాలంటూ నాయకులు మదనపడుతున్నారు. ఇకనైనా ఇలాటివారిపట్ల అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు.
వారి సభ్యత్వాన్ని రద్దు చేయండి
మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన చాళుక్య హోటల్ విక్రయానికి అనుకూలంగా ఓటేసిన వైసీపీ కార్పొరేటర్ల సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆపార్టీకి చెందిన మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు గురువారం కమిషనర్ మౌర్యకు వినతిపత్రం అందజేశారు. కౌన్సిల్ సమావేశానికి ముందు తమ పార్టీ కార్పొరేటర్లకు విప్ జారీ చేసినా కొందరు ధిక్కరించి కూటమికి అనుకూలంగా మాట్లాడారన్నారు. కమిషనర్‌ను కలిసినవారిలో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఉమా అజయ, ఆరణి సంధ్య, అమరనాథ్ రెడ్డి, అనిల్ తదితరులు ఉన్నారు.