కొత్త టీచర్లకు కౌన్సెలింగ్ చిక్కులు
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:17 AM
మూడు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించబోయే వారికి కౌన్సెలింగు ప్రారం భంలో చిక్కులు ఎదురయ్యాయి.సెకండరీ గ్రేడ్ టీచర్లు పోస్గింగ్ కౌన్సెలింగు కోసం తిరుపతిలో గురువారం రాత్రి పడిగాపులు కాయాల్సి వచ్చింది.డీఎస్సీ ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1403మంది ఉద్యోగం పొందారు. వీరిలో 1394 మంది ఈనెల 3నుంచి చిత్తూరు, తిరుపతి కేంద్రాల్లో శిక్షణా తరగతులకు హాజరు కాగా,తొమ్మిదిమంది గైర్హాజరయ్యారు.తిరుపతి నగరం జీవకోనలోని విశ్వం స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు గురువారం రాత్రి 11గంటల తరువాత మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రారంభిం చారు.ఆర్జేడీ శామ్యూల్, తిరుపతి డీఈవో కేవీఎన్ కుమార్, చిత్తూరు డీఈవో బి.వరలక్ష్మి కౌన్సిలింగ్‌ను పర్యవేక్షించారు. ఒకటినుంచి 250మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగు పూర్తి చేస్తారు.శుక్రవారం 251నుంచి 700వరకూ తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రంలోని మెడ్జ్ స్కూల్లో, 701నుంచి 922వరకూ గూడూరులోని ఆదిశంకరా ఇంజనీరింగు కళాశాలలో మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.కాగా కొత్త ఉపాధ్యాయులకు శుక్రవారంతో శిక్షణ తరగతులు ముగియనున్నాయి. గురు,శుక్రవారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయిస్తారు.వీరంతా సోమవారం విధుల్లో చేరాల్సి ఉంది.పాఠశాల కేటాయింపుల కౌన్సెలింగ్ ప్రక్రియలో గురువారం గందరగోళం నెలకొంది. 917 మంది ఎస్జీటీ అభ్యర్థులకు బుధవారం నుంచి తొలుత వెబ్ కౌన్సెలింగ్ అంటూ చెప్పిన అధికారులు, గురువారం సాయంత్రానికి ఆ ప్రక్రియను మాన్యువల్‌గా మార్చారు. స్కూల్ అసిస్టెంట్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ అంటూ చివరికి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు.ఇందుకు సంబంధించి ఎస్‌ఏలకు ఖాళీలను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.
ఎస్జీటీలకు మాన్యువల్, ఎస్‌ఏలకు వెబ్ కౌన్సెలింగ్
రాత్రి వేళ తిరుపతిలో అయ్యోర్ల పడిగాపులు
చిత్తూరు సెంట్రల్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):మూడు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించబోయే వారికి కౌన్సెలింగు ప్రారం భంలో చిక్కులు ఎదురయ్యాయి.సెకండరీ గ్రేడ్ టీచర్లు పోస్గింగ్ కౌన్సెలింగు కోసం తిరుపతిలో గురువారం రాత్రి పడిగాపులు కాయాల్సి వచ్చింది.డీఎస్సీ ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1403మంది ఉద్యోగం పొందారు. వీరిలో 1394 మంది ఈనెల 3నుంచి చిత్తూరు, తిరుపతి కేంద్రాల్లో శిక్షణా తరగతులకు హాజరు కాగా,తొమ్మిదిమంది గైర్హాజరయ్యారు.తిరుపతి నగరం జీవకోనలోని విశ్వం స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు గురువారం రాత్రి 11గంటల తరువాత మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రారంభిం చారు.ఆర్జేడీ శామ్యూల్, తిరుపతి డీఈవో కేవీఎన్ కుమార్, చిత్తూరు డీఈవో బి.వరలక్ష్మి కౌన్సిలింగ్‌ను పర్యవేక్షించారు. ఒకటినుంచి 250మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగు పూర్తి చేస్తారు.శుక్రవారం 251నుంచి 700వరకూ తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రంలోని మెడ్జ్ స్కూల్లో, 701నుంచి 922వరకూ గూడూరులోని ఆదిశంకరా ఇంజనీరింగు కళాశాలలో మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.కాగా కొత్త ఉపాధ్యాయులకు శుక్రవారంతో శిక్షణ తరగతులు ముగియనున్నాయి. గురు,శుక్రవారాల్లో కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయిస్తారు.వీరంతా సోమవారం విధుల్లో చేరాల్సి ఉంది.పాఠశాల కేటాయింపుల కౌన్సెలింగ్ ప్రక్రియలో గురువారం గందరగోళం నెలకొంది. 917 మంది ఎస్జీటీ అభ్యర్థులకు బుధవారం నుంచి తొలుత వెబ్ కౌన్సెలింగ్ అంటూ చెప్పిన అధికారులు, గురువారం సాయంత్రానికి ఆ ప్రక్రియను మాన్యువల్‌గా మార్చారు. స్కూల్ అసిస్టెంట్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ అంటూ చివరికి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు.ఇందుకు సంబంధించి ఎస్‌ఏలకు ఖాళీలను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు.
పూర్తి ఖాళీలు చూపని వైనం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటీవల ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించారు. కౌన్సెలింగ్ ద్వారా సీనియారిటీ జాబితా ఆధారంగా,ఉపాధ్యాయులు స్థానాలు కోరుకుని విధుల్లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాశాఖలో క్లియర్ వేకెన్సీలు వచ్చేశాయి. అయితే కొత్తగా వచ్చే ఉపాధ్యాయులకు క్లియర్ వేకెన్సీలు పూర్తిగా చూపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. హెచ్‌ఆర్‌కే ఒకటి, రెండు కేటగిరీల ఖాళీలు చూపకుండా, కేవలం హెచ్‌ఆర్‌కే మూడు, నాలుగు కేటగిరీల వేకెన్సీలు చూపుతున్నారు. దీంతో కొత్త ఉపాధ్యాయులకు మండల స్థాయి, మారుమూల గ్రామీణ ప్రాంత పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి.1394మంది ఉపాధ్యాయులకు 1:1 ఖాళీలు మాత్రమే చూపుతున్నారు. అంటే 1394 స్థానాలనే వేకెన్సీలుగా చూపుతున్నారు. కాగా ఒకటి రెండు కేటగిరిలైన మున్సిపల్ కార్పోరేషన్, మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల్లో ఏకంగా 500 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా వున్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించినా, వీటిని కౌన్సెలింగ్‌లో చూపకపోవడంపై విమర్శలు వచ్చాయి.
రాత్రి 11గంటల తరువాత మొదలైన కౌన్సెలింగ్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొత్తగా ఎంపికైన 917మంది ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం రాత్రి 11గంటల తరువాత తిరుపతిలో మొదలైంది. వాస్తవానికి సాయంత్రం 5 గంటలకు మొదలు పెట్టి రాత్రి 11 గంటలకు ముగించాలని రాష్ట్రస్థాయి అధికారులు సూచించారు. మరో వైపు ఖాళీల జాబితా ప్రచురించడంలోనూ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించడం ఉపాధ్యాయుల్ని నిరాశకు గురిచేసింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు మొత్తంగా 917మంది ఉన్నారు. ఎస్జీటీ (తెలుగు)లో 753మంది మండల పరిషత్ స్థాయిలో ఎంపిక కాగా, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 75మంది, మున్సిపాలిటీ పరిధిలో 53మంది, ఎస్జీటీ (ఉర్దూ)లో ఎంపీపీ స్థాయిలో 30మంది, మున్సిపాలిటీలో ఒకరు, ఎస్జీటీ (తమిళం)లో ఎంపీపీ పరిధిలో ఎంపికైన ఉపాధ్యాయులు ఐదుగురు ఉన్నారు.