‘జూడో క్లస్టర్’ క్రీడల్లో కానిస్టేబుల్ ప్రతిభ
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:13 AM
పదో ఆలిండియా పోలీసు జూడో క్లస్టర్-2025 క్రీడల్లో చిత్తూరు కానిస్టేబుల్ షంషీర్ ప్రతిభ చూపాడు. జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో గతనెల ఎనిమిది నుంచి 13వ తేదీవరకు జరిగిన క్రీడల్లో పెన్‌కాక్ సిలాట్ విభాగం 60 కిలోల కేటగిరీలో షంషీర్ మూడోస్థానంలో నిలిచి.. కాంస్యపతకాన్ని సాధించాడు.
చిత్తూరు అర్బన్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పదో ఆలిండియా పోలీసు జూడో క్లస్టర్-2025 క్రీడల్లో చిత్తూరు కానిస్టేబుల్ షంషీర్ ప్రతిభ చూపాడు. జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో గతనెల ఎనిమిది నుంచి 13వ తేదీవరకు జరిగిన క్రీడల్లో పెన్‌కాక్ సిలాట్ విభాగం 60 కిలోల కేటగిరీలో షంషీర్ మూడోస్థానంలో నిలిచి.. కాంస్యపతకాన్ని సాధించాడు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కానిస్టేబుల్‌ను ఎస్పీ తుషార్ పతకాన్ని ఆయన మెడలో వేసి అభినందించారు.