కానిస్టేబుల్.. డ్రగ్స్ సరఫరాదారు
ABN , Publish Date - Jun 04 , 2025 | 01:59 AM
కేవీబీపురం మండలం ఆరె గ్రామానికి చెందిన గుణశేఖర్ 2007లో ఎపీ ఎస్పీ కానిస్టేబుల్‌గా చేరాడు. 2009లో రిజర్వు విభాగానికి బదిలీ చేయించుకున్నాడు. ఇతడి భార్య రేణుక తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సు. తిరుపతి రూరల్ మండలం పేరూరులోని ఆర్‌ఎన్‌ఎర్ లేఅవుట్‌లో సొంతంగా ఇల్లున్నా.. నగరంలోనే ఉంటున్నారు. తొలినుంచీ తిరుపతి రిజర్వు యూనిట్‌లో కానిస్టేబుల్. తరచూ విధులకు ఎగ్గొట్టేవాడని, పనితీరుపైనా విమర్శలున్నట్లు అధికారులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఎంపీగా గెలుపొందిన గురుమూర్తి వద్ద 2022 జూన్ 13న గన్‌మ్యాన్‌గా చేరాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేది వరకు కొనసాగాడు. ఈ రెండున్నరేళ్ల కాలంలో స్థానికంగా ఇతడి అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. ప్రధానంగా అప్పట్లో భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసేవాడని.. ఎవరైనా ఉద్యోగాల కోసం ఎంపీ వద్దకు వస్తే, వారితో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. టీటీడీలో దర్శనాల విషయంలోనూ, ఇతరత్రా పనులు చేసిపెడతానంటూ నగదు వసూలు చేసినట్లు తెలిసింది. తనతోపాటు పనిచేస్తున్న పలువురు కానిస్టేబుళ్ల వద్ద డబ్బు తీసుకుని ఎగ్గొట్టినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి దందాలోనూ ఇతడు భాగస్వామి అయినట్లు తెలిసింది. ఈ క్రమంలో కొందరు వైసీపీ నేతల సహకారం ఇతడికి ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అదే సమయంలో తిరుపతి రూరల్ పేరూరు ప్రాంతానికి చెందిన వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు ఉన్నం సురేంద్రతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి పలు అక్రమ వ్యాపారాలు సాగించారు. రిజర్వు కానిస్టేబుల్ గుణశేఖర్ నగదు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఎంపీ గురుమూర్తి తన వద్ద గన్‌మ్యాన్‌గా వద్దని చెప్పి వెనక్కు పంపారని అధికారులు చెబుతున్నారు.
- హైదరాబాదులో పట్టుబడిన నిందితుల్లో ఇద్దరిది తిరుపతి జిల్లా
- ఈ మాఫియాలో కీలకం గుణశేఖర్
- జిల్లాలోనూ దందాలెన్నో?
- బాధిత మహిళ ఫిర్యాదుతో రూరల్‌లో కేసు
తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి
కేసు: బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాదుకు డ్రగ్స్ సరఫరా.
నిందితులు: హైదరాబాదులో ఐదుగురి అరెస్టు. పోలీసుల అదుపులో ఏ1 నిందితుడు. పరారీలో మరొకరు.
ఎ1- డ్రగ్స్ సరఫరాదారు తిరుపతి రిజర్వు కానిస్టేబుల్ గుణశేఖర్.
ఎ2- తిరుపతి రూరల్ మండలం పేరూరు వైసీపీ ద్వితీయ శ్రేణి నేత ఉన్నం సురేంద్ర
హైదరాబాదు పోలీసులకు పట్టుడిన ఆరుగురు డ్రగ్స్ ముఠాలో ఇద్దరు జిల్లా వారే. ఆ ఇద్దరూ కీలకమైన ఏ1, ఏ2 కావడం సంచలనం కలిగించింది.
కేవీబీపురం మండలం ఆరె గ్రామానికి చెందిన గుణశేఖర్ 2007లో ఎపీ ఎస్పీ కానిస్టేబుల్‌గా చేరాడు. 2009లో రిజర్వు విభాగానికి బదిలీ చేయించుకున్నాడు. ఇతడి భార్య రేణుక తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సు. తిరుపతి రూరల్ మండలం పేరూరులోని ఆర్‌ఎన్‌ఎర్ లేఅవుట్‌లో సొంతంగా ఇల్లున్నా.. నగరంలోనే ఉంటున్నారు. తొలినుంచీ తిరుపతి రిజర్వు యూనిట్‌లో కానిస్టేబుల్. తరచూ విధులకు ఎగ్గొట్టేవాడని, పనితీరుపైనా విమర్శలున్నట్లు అధికారులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఎంపీగా గెలుపొందిన గురుమూర్తి వద్ద 2022 జూన్ 13న గన్‌మ్యాన్‌గా చేరాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేది వరకు కొనసాగాడు. ఈ రెండున్నరేళ్ల కాలంలో స్థానికంగా ఇతడి అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. ప్రధానంగా అప్పట్లో భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసేవాడని.. ఎవరైనా ఉద్యోగాల కోసం ఎంపీ వద్దకు వస్తే, వారితో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రూ.లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. టీటీడీలో దర్శనాల విషయంలోనూ, ఇతరత్రా పనులు చేసిపెడతానంటూ నగదు వసూలు చేసినట్లు తెలిసింది. తనతోపాటు పనిచేస్తున్న పలువురు కానిస్టేబుళ్ల వద్ద డబ్బు తీసుకుని ఎగ్గొట్టినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి దందాలోనూ ఇతడు భాగస్వామి అయినట్లు తెలిసింది. ఈ క్రమంలో కొందరు వైసీపీ నేతల సహకారం ఇతడికి ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అదే సమయంలో తిరుపతి రూరల్ పేరూరు ప్రాంతానికి చెందిన వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు ఉన్నం సురేంద్రతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి పలు అక్రమ వ్యాపారాలు సాగించారు. రిజర్వు కానిస్టేబుల్ గుణశేఖర్ నగదు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఎంపీ గురుమూర్తి తన వద్ద గన్‌మ్యాన్‌గా వద్దని చెప్పి వెనక్కు పంపారని అధికారులు చెబుతున్నారు.
సెలవుల్లో డ్రగ్స్ సరఫరా!
ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఎంపీ గన్‌మ్యాన్‌గా వెనక్కి వచ్చిన గుణశేఖర్ నుంచి వెన్నునొప్పి అంటూ అదే నెల 26 నుంచే మే 17వ తేది వరకు సిక్ లీవు పెట్టాడు. ఆ తర్వాత బావమరిది వెంకటేష్ పెళ్లి ఉందంటూ మే 31 నుంచి జూన్ 9 వరకు లీవులో వెళ్లాడు. ఇలా సెలవు పెట్టి సురేంద్ర, మరికొందరితో కలిసి తన అక్రమ వ్యాపారాన్ని డ్రగ్స్‌వైపు మళ్లించినట్లు ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే కొకైన్, ఇతర డ్రగ్స్‌తో గుణశేఖర్ బ్యాచ్ హైదరాబాదు పోలీసులకు పట్టుబడింది.
డ్రగ్స్ దందాపై
అత్యున్నత విచారణ జరపాలి
అంతరాష్ట్ర డ్రగ్స్ మాఫియా కేసులో అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాసినట్లు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి రిజర్వు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గుణశేఖర్ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడితే.. కొన్ని నెలలుగా తన వద్ద విధుల్లో లేని వ్యక్తికి సంబంధించిన వ్యవహారాన్ని తనకు అంటకట్టడం టీడీపీ దగాకోరు విధానానికి నిదర్శనమన్నారు. తన వద్ద గన్‌మ్యాన్‌గా పనిచేసిన గుణశేఖర్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 26న విధుల నుంచి వెనక్కి పంపించేశానని.. ఈ రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని గుర్తుచేశారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాడతానన్నారు.
స్థలం అమ్ముతామంటూ మోసం
ఫ రిజర్వు కానిస్టేబుల్ గుణశేఖర్ దంపతులపై కేసు
స్థలం అమ్ముతామంటూ డబ్బు తీసుకుని మోసం చేశారన్న ఫిర్యాదుపై తిరుపతి రిజర్వు కానిస్టేబుల్ గుణశేఖర్, ఆయన భార్య రేణుకపై మంగళవారం కేసు నమోదైంది. ‘ప్లాట్ విక్రయిస్తామని చెప్పి రిజర్వు కానిస్టేబుల్ గుణశేఖర్, ఆయన భార్య రేణుక కలసి గతేడాది మార్చిలో రూ.22 లక్షలు తీసుకున్నారు. ఇప్పటి వరకు స్థలం రిజిస్ట్రేషన్ చేసివ్వలేదు. చాలాసార్లు వారి ఇంటికెళ్లి అడిగినా సరైన సమాధానం రాలేదు. తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా, ప్లాట్ రిజిస్ర్టేషన్ చేసివ్వక పోవడంతో మోసపోయామని గుర్తించాం’ అంటూ తిరుపతి రూరల్ మండలం పేరూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన తుంగ లక్ష్మి రెడ్డెమ్మ సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్‌ఎ్‌సలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ చిన్నగోవిందు ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ దంపతులపై మంగళవారం కేసు నమోదు చేశారు.