సర్వేయర్ల బదిలీల కౌన్సెలింగ్‌లో గందరగోళం
ABN , Publish Date - Jul 01 , 2025 | 01:28 AM
గ్రామ, వార్డు సచివాలయాల సర్వేయర్లకు ఆది, సోమవారాల్లో బదిలీలు జరిగాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని 520 మందికి గాను 398 మందికి బదిలీల కౌన్సెలింగ్ పూర్తయ్యింది. కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాలులో జరిగిన కౌన్సెలింగ్‌కు మూడు జిల్లాల అధికారులు, హాజరయ్యారు. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారిని బదిలీ చేశారు. సొంత మండలాలు కాకుండా పక్కనే ఉన్న మండలానికి పంపించారు. ర్యాంకుల ఆధారంగా ఈప్రక్రియ జరగ్గా, అధికారుల తప్పిదాల వల్ల తిరుపతి జిల్లాకు బదిలీ కావాల్సినవారు చిత్తూరు జిల్లాకు, చిత్తూరు జిల్లాకు బదిలీ కావల్సిన వారు తిరుపతి జిల్లాకు బదిలీ అయ్యామంటూ ఆరోపించారు. సోమవారం గందరగోళం మధ్య కౌన్సెలింగ్ సాయంత్రం వరకు కొనసాగింది.
సీనియారిటీ జాబితాలో మార్పుపై నిరసన
రెండు గంటలపాటు నిలిచిన ప్రక్రియ
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల సర్వేయర్లకు ఆది, సోమవారాల్లో బదిలీలు జరిగాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని 520 మందికి గాను 398 మందికి బదిలీల కౌన్సెలింగ్ పూర్తయ్యింది. కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాలులో జరిగిన కౌన్సెలింగ్‌కు మూడు జిల్లాల అధికారులు, హాజరయ్యారు. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారిని బదిలీ చేశారు. సొంత మండలాలు కాకుండా పక్కనే ఉన్న మండలానికి పంపించారు. ర్యాంకుల ఆధారంగా ఈప్రక్రియ జరగ్గా, అధికారుల తప్పిదాల వల్ల తిరుపతి జిల్లాకు బదిలీ కావాల్సినవారు చిత్తూరు జిల్లాకు, చిత్తూరు జిల్లాకు బదిలీ కావల్సిన వారు తిరుపతి జిల్లాకు బదిలీ అయ్యామంటూ ఆరోపించారు. సోమవారం గందరగోళం మధ్య కౌన్సెలింగ్ సాయంత్రం వరకు కొనసాగింది. పలుసార్లు సీనియారిటీ జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. దాంతో సర్వేయర్లకు తెలియకుండా, జాబితా ప్రచురించకుండానే జరిగిన కౌన్సెలింగ్‌లో కొందరు తమకు అనుకూలమైన సర్వేయర్లకు స్థానాలు కేటాయించేందులో అధికారులు అడ్డదారులు తొక్కారంటూ పలువురు అడ్డుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. ఫలితంగా మధ్యాహ్నం రెండు గంటలపాటు కౌన్సెలింగ్ ఆగిపోయింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను పునఃప్రారంభించి 5 గంటలకు ముగించారు. కౌన్సెలింగ్‌లో చిత్తూరు జిల్లా సర్వేశాఖ ఏడీ జయరాజ్, అన్నమయ్య జిల్లా ఏడీ భరత్‌కుమార్, సూపరింటెండెంట్ రాజేంద్ర, తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ చంద్రిక తదితరులు పాల్గొన్నారు.