Share News

ఎస్‌ఏలకు ముగిసిన పదోన్నతులు

ABN , Publish Date - May 31 , 2025 | 01:47 AM

స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్‌-2 హెచ్‌ఎంల దాకా బదిలీల, పదోన్నతి ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది.డీఈవో వరలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 9.30 గంటలకు చిత్తూరు డీఈవో కార్యాలయం పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన పదోన్నతుల ప్రక్రియ శుక్రవారం వేకువ జామున 3 గంటల వరకు సాగింది.

ఎస్‌ఏలకు ముగిసిన పదోన్నతులు
ఎస్‌ఏలకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్న విద్యాశాఖాధికారులు

186మందికి గ్రేడ్‌-2 హెచ్‌ఎంలుగా ప్రమోషన్‌

చిత్తూరు సెంట్రల్‌, మే 30(ఆంధ్రజ్యోతి): స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్‌-2 హెచ్‌ఎంల దాకా బదిలీల, పదోన్నతి ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది.డీఈవో వరలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 9.30 గంటలకు చిత్తూరు డీఈవో కార్యాలయం పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన పదోన్నతుల ప్రక్రియ శుక్రవారం వేకువ జామున 3 గంటల వరకు సాగింది. 186 మందికి స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్‌-2 హెచ్‌ఎంలుగా పదోన్నతి లభించింది.జడ్పీ యాజమాన్యంలో 155 పోస్టులకు గాను ముగ్గురు గైర్హాజరయ్యారు. వీరితో సహా 155 మందికి పదోన్నతులు లభించాయి. 25 మంది టీచర్లు నాట్‌ విల్లింగ్‌ ఇచ్చారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 12 మంది, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల్లో ఏడుగురికి పదోన్నతి లభించింది. ఏడీలు వెంకటేశ్వరరావు, సుకుమార్‌, నాగరాజు, రాంకుమార్‌, మురళి, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు సంబంధించి 12 మందికి కడప ఆర్జేడీ కార్యాలయంలో ఈ ప్రక్రియ జరిగింది.

ఒక్క రోజు హెచ్‌ఎంలుగా ముగ్గురు టీచర్లు

ఒక్క రోజు హెచ్‌ఎంలైన వారిలో ముగ్గురు టీచర్లున్నారు. ఈ ముగ్గురు శుక్రవారం ప్రస్తుతమున్న స్థానంలో రిలీవై, శనివారం ఉదయం కొత్త చోట జాయినై గ్రేడ్‌-2లుగా పదోన్నతి పొందుతారు.అదే రోజు సాయంత్రం రిటైర్‌ కానున్నారు. మిగిలిన వారు శనివారం ప్రస్తుతమున్న స్థానంలో రిలీవై, జూన్‌ 1న ఆదివారం కొత్త చోట జాయినై గ్రేడ్‌-2 హెచ్‌ఎంలుగా పదోన్నతి పొందుతారు.వీరిలో కుప్పం ఎంపీపీఎస్‌ నుంచి ప్రైమరీ స్కూల్‌ హెచ్‌ఎం కె.వి.శ్రీదేవి పదోన్నతిపై గుండ్ల్యాయనివారి పల్లె జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లారు.తిరుపతిలోని పద్మావతిపురం జడ్పీ హైస్కూలు నుంచి ఇంగ్లీష్‌ ఎస్‌ఏ టి.సుధారాణి పదోన్నతిపై పొన్నగూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు హెచ్‌ఎంగా వెళ్లారు. తిరుచానూరు సమీపంలోని ఓటేరు ఎంపీపీఎస్‌ నుంచి హెచ్‌ఎం ఎస్‌.సుబ్రమణ్యం పదోన్నతిపై తిమ్మరాజుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లారు.

Updated Date - May 31 , 2025 | 01:47 AM