Share News

క్రమశిక్షణతో శిక్షణ పూర్తిచేయండి

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:33 AM

క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేసుకుని భవిష్యత్తులో బాధ్యతతో విధులు నిర్వహించాలని ఐజీ రవిప్రకాష్‌ సూచించారు.

క్రమశిక్షణతో శిక్షణ పూర్తిచేయండి
ఫైరింగ్‌ శిక్షణ ప్రారంభిస్తున్న ఐజీ

చంద్రగిరి, డిసెండరు 22(ఆంధ్రజ్యోతి): కళ్యాణి డ్యామ్‌ పోలీస్‌ శిక్షణా కళాశాలలో శిక్షణార్థులు క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేసుకుని భవిష్యత్తులో బాధ్యతతో విధులు నిర్వహించాలని ఐజీ రవిప్రకాష్‌ సూచించారు. చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని కల్యాణి డ్యామ్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలకు శిక్షణ పొందడానికి కడప, గుంటూరు రూరల్‌, కర్నూల్‌ జిల్లాల నుంచి కొత్తగా ఎంపికైన 608 మంది కానిస్టేబుల్స్‌ వచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఐజీ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ కానిస్టేబుళ్లు 9 నెలలపాటు పొందే శిక్షణలో శారీరక దృఢత్వం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించిన వారు వృత్తిలో సమర్థవంతంగా రాణించే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఫైరింగ్‌ శిక్షణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం, వైస్‌ ప్రిన్సి పాల్‌ శ్రీనివాసులు, డీఎస్పీలు రా.గోపాల్‌రెడ్డి, సుకుమారి, ష్యాన్‌షేక్‌, సీఐలు అంజూ యాదవ్‌, సురేంద్ర రెడ్డి, భాస్కర్‌, సురే్‌షకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:33 AM