సూళ్లూరుపేట కమిషనర్‌పై ఫిర్యాదు
ABN , Publish Date - May 06 , 2025 | 01:04 AM
సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ్యపై చిత్తూరులో పోలీసులకు ఫిర్యాదు అందింది. సోమవారం చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ స్థానిక వన్‌టౌన్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు.
చిత్తూరు అర్బన్, మే 5 (ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ్యపై చిత్తూరులో పోలీసులకు ఫిర్యాదు అందింది. సోమవారం చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ స్థానిక వన్‌టౌన్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. ‘చిన్నయ్య తన తండ్రి బతికుండగా, ఆ విషయాన్ని దాచిపెట్టి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందాడని, తర్వాత తప్పుడు సర్టిఫికెట్లను అందజేసి పదోన్నతులు పొందాడు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర మునిసిపల్ పరిపాలన శాఖ (డీఎంఏ) ఆదేశాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు విచారణ ప్రారంభించారు.