సత్యసాయి స్ఫూర్తితో సమాజ సేవ
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:16 AM
సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. పద్మావతి నగర్‌లో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం, సత్యసాయి సేవాసమితి ఆఽధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సత్యసాయి స్ఫూర్తితో సమాజ సేవ
తిరుపతి(కలెక్టరేట్), నవంబరు 23(ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. పద్మావతి నగర్‌లో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం, సత్యసాయి సేవాసమితి ఆఽధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొని సత్యసాయి చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ సత్యసాయి ట్రస్టు చేపట్టిన సేవా కార్యక్రమాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా కరువ పరిస్థితులో ఉన్న సమయంలో బాగా ఆదుకున్నాయని తెలిపారు. కలెక్టరేట్‌లో డీఆర్వో నరసింహులు ఆధ్వర్యంలో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు నిర్వహించారు.