Share News

కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌

ABN , Publish Date - Dec 06 , 2025 | 01:40 AM

జిల్లావ్యాప్తంగా ఉన్న 88 ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమపథకాల అమలు తీరు పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌లో శుక్రవారం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటైంది. కలెక్టరేట్‌లో నిర్మించిన నాగార్జున వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో దీన్ని ఏర్పాటు చేశారు.

కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఉన్న 88 ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమపథకాల అమలు తీరు పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌లో శుక్రవారం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటైంది. కలెక్టరేట్‌లో నిర్మించిన నాగార్జున వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో దీన్ని ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు ఆరు గురు అధికారులను నియమిచారు. ఎప్పటికప్పుడు వివరాల సేకరణకు ఇబ్బందుల్లేకుండా ఐదు ల్యాండ్‌లైన్‌ ఫోన్లను ఏర్పాటు చేశారు. వీటి నెంబర్లు 08572-242730, 242731, 242732, 242733, 242734. ఇన్‌ఛార్జి ఆఫీసర్లుగా డీఆర్‌డీఏ అడిషనల్‌ పీడీ రవికుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లుగా వినోద్‌, సుధాకర్‌, పురుషోత్తం, అరవిందరెడ్డి, రామాంజనేయులును నియమించారు. వీరి మొబైల్‌ నెంబర్లను అందుబాటులో ఉంచారు. డివిజన్ల వారీగా మండలాలు, మున్సిపాలిటీల్లో అన్ని ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సచివాలయ వ్యవస్థలో హాజరు, పనితీరు, పీజీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చే వినతుల పరిష్కారం, పనుల ప్రగతిని ఈ కంట్రోల్‌ రూమ్‌ అధికారులు పర్యవేక్షిస్తారు. రోజువారీ ప్రగతి వివరాలను కలెక్టర్‌కు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ అధికారులు అందిస్తారు.

Updated Date - Dec 06 , 2025 | 01:40 AM